మోడీని చూసి దేశం నవ్వుతోంది…

  బర్గారి (పంజాబ్): తను ఒక్కడే దేశాన్ని నడిపించగలనని ప్రధాని మోడీ అనుకుంటున్నారని, కానీ దేశాన్ని నడిపించేది ప్రజలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సిద్దికీకి మద్దతుగా ఇక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు…‘మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోడీ ఎగతాళి చేసేవారు. అయిదేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దేశం మోడీని చూసి నవ్వుతోంది’ అన్నారు. ‘ మీ ధర్మం పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌కు జరిగిన […] The post మోడీని చూసి దేశం నవ్వుతోంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బర్గారి (పంజాబ్): తను ఒక్కడే దేశాన్ని నడిపించగలనని ప్రధాని మోడీ అనుకుంటున్నారని, కానీ దేశాన్ని నడిపించేది ప్రజలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సిద్దికీకి మద్దతుగా ఇక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు…‘మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోడీ ఎగతాళి చేసేవారు. అయిదేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దేశం మోడీని చూసి నవ్వుతోంది’ అన్నారు. ‘ మీ ధర్మం పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌కు జరిగిన అవమానం గురించి మీకు గుర్తు చేసేందుకు వచ్చాను. తప్పు చేసిన వారిపై కఠిన చర్య తీసుకుంటాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నాను’ అని రాహుల్ చెప్పారు. రాఫెల్ జెట్ ఒప్పందం గురించి చెబుతూ ఆయన అవినీతిపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బటిండాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ 2015లో సిక్కులకు జరిగిన దైహద్రోహ సంఘటనలపై బిజెపి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ను దుమ్మెత్తి పోశారు.

The country laughs at Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీని చూసి దేశం నవ్వుతోంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: