గాలివాన భీభత్సవం…

  * లింగాలలో పిడుగుపడి వ్యక్తి మృతి * వంగూరు మండలంలో నేలకొరిగిన భారీ విద్యుత్ టవర్లు * బల్మూర్, ఊర్కొండ మండలాల్లో పిడుగు పడి నాలుగు ఎద్దులు మృతి నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్‌జిల్లాలో బుధవారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. భీకరమైన గాలివీయడంతో వంగూరు మండలంలో భారీ విద్యుత్ టవర్లు నేలకొరిగాయి. దీంతోపాటు లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో పిడుగుపడటంతో ఈదమయ్య అనే వ్యక్తి మృతి చెందగా, గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అదేవిధంగా బల్మూర్ మండలంలో […] The post గాలివాన భీభత్సవం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* లింగాలలో పిడుగుపడి వ్యక్తి మృతి
* వంగూరు మండలంలో నేలకొరిగిన భారీ విద్యుత్ టవర్లు
* బల్మూర్, ఊర్కొండ మండలాల్లో పిడుగు పడి నాలుగు ఎద్దులు మృతి

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్‌జిల్లాలో బుధవారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. భీకరమైన గాలివీయడంతో వంగూరు మండలంలో భారీ విద్యుత్ టవర్లు నేలకొరిగాయి. దీంతోపాటు లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో పిడుగుపడటంతో ఈదమయ్య అనే వ్యక్తి మృతి చెందగా, గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అదేవిధంగా బల్మూర్ మండలంలో పిడుగుపాటుకు గురై మూడెద్దులు మృతిచెందగా , ఊర్కొండ మండలంలో ఒక ఎద్దు మృతిచెందింది. వంగూరు మండల కేంద్రంలోని ఎల్లమ్మ రంగాపూర్‌లో గాలివానకు భారీ విద్యుత్‌టవర్లు విరిగిపడ్డాయి. ప్రాణహాని సంభవించలేదు. కల్వకుర్తిలో భారీ వర్షం కారణంగా మండలంలోని వివిధ గ్రామాలల్లో , పట్టణంలో విద్యుత్ స్తంభాలు , చెట్లు విరిగిపడ్డాయి. కల్లాల్లో ఉంచిన వరిధాన్యం నీటికి తడిసింది. మరికొంతమంది రైతుల నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు సమాచారం. గాలివాన కారణంగా జనజీవనం స్తంభించింది. రేకుల ఇండ్లు ,పశువుల కొట్టాలు గాలికి ఎగిరిపడ్డాయి. కల్వకుర్తి నియోజకవర్గంతోపాటు కోడేర్ మండలంలోని మామిడితోటలలో గాలికి కాయలు రాలిపడ్డాయి. దీంతోమామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు నష్ట అంచనాల్లో ఉండగా విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది విద్యుత్ లైన్లను పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Wind worm created terror.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గాలివాన భీభత్సవం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: