పేటీఎంలో రూ.10 కోట్ల మోసం

  న్యూఢిల్లీ : దాదాపు 10 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. ఇవై ఆడిట్ నిర్వహించిన అనంతరం ఇకామర్స్ బిజినెస్‌లో పది మంది ఉద్యోగులు, 100 మంది వెండార్స్‌ను డీలిస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. కంపెనీలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్టు విచారణలో వెలుగుచూసింది. ఆడిట్ సంస్థ ఇవైతో సంస్థ సంబంధాలు కొనసాగుతాయని, మోసం దర్యాప్తు కోసం ప్రత్యేకించి ఎవరినీ నియమించలేదని అన్నారు. […] The post పేటీఎంలో రూ.10 కోట్ల మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : దాదాపు 10 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. ఇవై ఆడిట్ నిర్వహించిన అనంతరం ఇకామర్స్ బిజినెస్‌లో పది మంది ఉద్యోగులు, 100 మంది వెండార్స్‌ను డీలిస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. కంపెనీలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్టు విచారణలో వెలుగుచూసింది. ఆడిట్ సంస్థ ఇవైతో సంస్థ సంబంధాలు కొనసాగుతాయని, మోసం దర్యాప్తు కోసం ప్రత్యేకించి ఎవరినీ నియమించలేదని అన్నారు. పేటీఎం మాల్‌లో భారీ మోసం చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ అధికారులు గుర్తించారు. క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.10 కోట్ల వరకు మోసం జరిగిందని గుర్తించారు. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఇవైతో కలిసి రూపొందించిన ఒక ప్రత్యేక టూల్‌తో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. నకిలీ ఆర్డర్లు సృష్టించి క్యాష్‌బ్యాక్ ద్వారా వచ్చిన సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించారని శర్మ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Paytm probe reveals at least Rs 10 cr fraud

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పేటీఎంలో రూ.10 కోట్ల మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: