ఎటిఎంల కొరత

వినియోగం పెరిగినా తగ్గుతున్న ఎటిఎంల సంఖ్య కఠిన నిబంధనలు, నిర్వహణ భారమే కారణం న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత బ్యాంకు లావాదేవీలు పెరగ్గా, ఇదే సమయంలో ఎటిఎంలకు కూడా మరింతగా డిమాండ్ పెరిగింది. కొత్త టెక్నాలజీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు నగదు కోసం ఎటిఎంలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయిప్పటికీ దేశంలో ఎటిఎంల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లావాదేవీలు పెరిగినప్పటికీ రెండేళ్ల నుంచి దేశంలో ఎటిఎంల కొరత మరింత […] The post ఎటిఎంల కొరత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వినియోగం పెరిగినా తగ్గుతున్న ఎటిఎంల సంఖ్య
కఠిన నిబంధనలు, నిర్వహణ భారమే కారణం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత బ్యాంకు లావాదేవీలు పెరగ్గా, ఇదే సమయంలో ఎటిఎంలకు కూడా మరింతగా డిమాండ్ పెరిగింది. కొత్త టెక్నాలజీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు నగదు కోసం ఎటిఎంలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయిప్పటికీ దేశంలో ఎటిఎంల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లావాదేవీలు పెరిగినప్పటికీ రెండేళ్ల నుంచి దేశంలో ఎటిఎంల కొరత మరింత తీవ్రమైందని, మరోవైపు నిబంధనలు కఠినతరం కావడం కూడా ఎటిఎంల నిర్వహణకు భారంగా మారిందని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గణాంకాలు చెబుతున్నా యి. బ్రిక్స్ దేశాల్లో ప్రతి లక్షమందికి అతి తక్కువగా ఎటిఎంలు అందుబాటులో ఉన్న దేశం భారత్ అని ఐఎంఎఫ్ వెల్లడించింది. గత ఏడాది రిజర్వు బ్యాంక్ ఎటిఎంల నిర్వహణ, భద్రతకు సంబంధించిన నిబంధనలను మార్చింది. దీంతో కొత్త సాఫ్ట్‌వేర్, పరికరాల కొనుగోళ్లు ఎటిఎంల నిర్వాహకులకు, బ్యాంకులకు భారంగా మారాయి.

దీంతో ఎటిఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మరో పక్క పెద్ద నోట్లు రద్దైనా ప్రజలు పూర్తిగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు, కార్డులకు అలవాటుపడలేదు. దీంతో నగదు లావాదేవీల సంఖ్యలో గణనీయమైన మార్పులు రాలేదు. ఎటిఎంల వద్ద లావాదేవీలు, భద్రతా నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిర్వాహకుల లాభాల్లో భారీగా కోతపడుతోంది. వారికి వచ్చే మొత్తాలకు బ్యాంకింగ్ రంగంలోని కీలక కమిటీ ఆమోదముద్ర ఉండాలి. ప్రస్తుతం బ్యాంకులు ఇంటర్‌ఛార్జీల రూపంలో రూ.15 వరకు వసూ లు చేస్తున్నాయి. బ్యాంక్‌ల ఎటిఎంల నిర్వహణలో ఇది అత్యంత కీలకమైంది. బ్యాంకులు సొంత ఎటిఎంల నిర్వహణ కంటే లావాదేవీల సమయంలో ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన ఇంటర్ ఛార్జీలను తగ్గించుకోవడానికి చూస్త్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని రకాల పథకాల కారణంగా 2014 తర్వాత నుంచి అదనంగా 355 మిలియన్ల మంది బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దనోట్లు రద్దు కావడంతో ఏటీఎంలపై ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్రాంచులను తగ్గించుకోవడం వల్ల ఎటిఎంల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇటీవల పలు బ్యాంకులు విలీనం కావడం వల్ల ఎటిఎంలను తగ్గుంచుకున్నాయి.

పెరిగిన మొబైల్ బ్యాంకింగ్
ఎటిఎంల సంఖ్య తగ్గడం మొబైల్ బ్యాంకింగ్‌కు సానుకూలంగా మారింది. దేశంలో గత ఐదేళ్లలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు 65 రెట్లు పెరిగాయి. ప్రజలు మొబైల్ యాప్స్ వైపు ఆసక్తి చూపుతున్నారని ఫెడరల్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశుతోష్ ఖజురియా అన్నారు. ఎటిఎంల గురించి ఇప్పుడ ఏమీ చెప్పలేమని, అయితే ఇవి క్రమంగా తగ్గే అవకాశముందని, క్షీణిస్తున్నా వాటిలో ఎవరకు ఇన్వెస్ట్ చేస్తారని ఆయన అన్నారు.

Mobile banking services increased 65 times in five years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎటిఎంల కొరత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: