ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 5 నెలల గరిష్ఠానికి

0.64 శాతం తగ్గిన ఎగుమతులు 4.5 శాతం పెరిగిన దిగుమతులు లోటు 15.33 బిలియన్ డాలర్లు నమోదు న్యూఢిల్లీ : ఏప్రిల్ నెలలో దేశీయ ఎగుమతుల వృద్ధి 0.64 శాతంతో నాలుగు నెలల కనిష్టానికి చేరింది. ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్ అండ్ జువెలరీ, లెదర్, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించడం వల్ల ఎగుమతుల వృద్ధి క్షీణించింది. దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. దీంతో వాణి జ్య లోటు ఐదు నెలల గరిష్టానికి చేరింది. ఈమేరకు కేంద్ర గణాంకాల […] The post ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 5 నెలల గరిష్ఠానికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
0.64 శాతం తగ్గిన ఎగుమతులు
4.5 శాతం పెరిగిన దిగుమతులు
లోటు 15.33 బిలియన్ డాలర్లు నమోదు

న్యూఢిల్లీ : ఏప్రిల్ నెలలో దేశీయ ఎగుమతుల వృద్ధి 0.64 శాతంతో నాలుగు నెలల కనిష్టానికి చేరింది. ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్ అండ్ జువెలరీ, లెదర్, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించడం వల్ల ఎగుమతుల వృద్ధి క్షీణించింది. దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. దీంతో వాణి జ్య లోటు ఐదు నెలల గరిష్టానికి చేరింది. ఈమేరకు కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) వివరాలను వెల్లడించింది. ఏప్రిల్‌లో ఎగుమతులు 26 బిలియన్ డాలర్లు, అలాగే దిగుమతులు 41.4 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లు నమోదవగా, 2018 నవంబర్ నుంచి ఇదే అత్యంత భారీ వాణిజ్య లోటు కావడం గమనార్హం. ఇంజనీరింగ్, జెమ్స్ అండ్ జువెలరీ, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, బియ్యం, కాఫీ వంటి కీలక రంగాల్లో ప్రతికూల వృద్ధి కారణంగా దేశీయ ఎగుమతులు క్షీణించాయి. 2018 డిసెంబర్‌లో ఎగుమతుల్లో వృద్ధి రేటు 0.34 శాతంతో తగ్గింది. చమురు ఎగుమతులు 11.38 బిలియన్ డాలర్లతో 9.26 శాతం పెరగ్గా, చమురు యేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు 3.97 బిలియన్ డాలర్లతో 54 శాతం పెరిగాయి. ఎగుమతులు పెట్రోలియం, హస్తకళలు సానుకూల వృద్ధి నమోదు చేశాయి.

Exports grow marginally, imports up 4.5 per cent in April

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 5 నెలల గరిష్ఠానికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: