ఆ అవకాశాలు రావడం లేదు

  బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ ఆశించినంత వేగంగా లేదు. ఇప్పటివరకు ఆమెకు యంగ్ స్టార్ల సరసన ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రాలేదు. ‘ఆర్‌ఎక్స్ 100’ సక్సెస్ తర్వాత అందరూ అలాంటి పాత్రలే ఆఫర్ చేశారని గతంలో ఈ భామ చెప్పింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామని ప్రస్తుతం పాయల్ వయసుతో నిమిత్తం లేకుండా సీనియర్ హీరోల సరసన నటించేందుకు సైతం ఓకే చెప్పేస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌తో ‘వెంకీ […] The post ఆ అవకాశాలు రావడం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ ఆశించినంత వేగంగా లేదు. ఇప్పటివరకు ఆమెకు యంగ్ స్టార్ల సరసన ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రాలేదు. ‘ఆర్‌ఎక్స్ 100’ సక్సెస్ తర్వాత అందరూ అలాంటి పాత్రలే ఆఫర్ చేశారని గతంలో ఈ భామ చెప్పింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామని ప్రస్తుతం పాయల్ వయసుతో నిమిత్తం లేకుండా సీనియర్ హీరోల సరసన నటించేందుకు సైతం ఓకే చెప్పేస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌తో ‘వెంకీ మామ’ చిత్రంలో చేస్తున్న పాయల్ ఇప్పుడు బాలకృష్ణతో కెఎస్ రవికుమార్ తీయబోయే మూవీలో హీరోయిన్‌గా చేయనుంది. దీని నిర్మాత సి.కళ్యాణ్ గతంలో పాయల్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అది ఆలస్యం అవుతుండటంతో ఆ డేట్స్‌ని దీనికోసం వాడుకుంటారని తెలిసింది. ఇక మరో సినిమా ‘డిస్కో రాజా’లో హీరో రవితేజకు జోడీగా నటిస్తోంది. అయితే ఈ భామకు యంగ్ స్టార్లకు జోడీగా నటించే అవకాశాలు మాత్రం రావడం లేదు.

Payal Rajput to acting with Ravi Teja in Disco Raja movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ అవకాశాలు రావడం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: