మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలు ప్రశాంతం: నాగిరెడ్డి

  హైదరాబాద్: మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిస్తాయని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. మూడు విడుతల్లో మొత్తం 77.46 శాతం పోలింగ్ నమోదైందని, మే 27వ తేదిన ఫలితాలను వెల్లడించడనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 123 చోట్ల కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని మూడు దశల్లో కౌంటింగ్ జరుగుతుందని నాగిరెడ్డి వెల్లడించారు. ముందు ఎంపిటిసి, ఆ తర్వాత జడ్పిటిసి కౌంటింగ్ ఉంటుందని, ప్రతి ఎంపిటిసికి రెండు కౌంటింగ్ సెంటర్లు […] The post మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలు ప్రశాంతం: నాగిరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిస్తాయని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. మూడు విడుతల్లో మొత్తం 77.46 శాతం పోలింగ్ నమోదైందని, మే 27వ తేదిన ఫలితాలను వెల్లడించడనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 123 చోట్ల కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని మూడు దశల్లో కౌంటింగ్ జరుగుతుందని నాగిరెడ్డి వెల్లడించారు. ముందు ఎంపిటిసి, ఆ తర్వాత జడ్పిటిసి కౌంటింగ్ ఉంటుందని, ప్రతి ఎంపిటిసికి రెండు కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు జరగలేదని, నాగర్ కర్నూల్ లో రూ. 10 లక్షలు పంచుతూ దొరకడం వల్లే ఎన్నిక వాయిదా వేశామని నాగిరెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికైన జడ్పిటిసిలు, ఎంపిటిసిలు జూలై 4 నుంచి అధికారంలోకి వస్తారాని, ఇదిలా ఉండగా జూలై 5వ తేదీ తర్వాత జడ్పి చైర్మన్ ఎన్నిక జరుగుతుందని నాగిరెడ్డి సూచించారు.

ZPTC, MPTC elections completed in 3 phases

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలు ప్రశాంతం: నాగిరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: