కొడుకా…లొంగిపో…

పెంబి (నిర్మల్) : 1988లో మావోయిస్ట్‌ పార్టీ పట్ల ఆకర్షితుడై వారిలో కలిసిపోయిన పెంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని బావాపూర్ గ్రామానికి చెందిన తూము శ్రీనివాస్ లొంగిపోవాలని ఆయన తల్లి లచ్చవ్వ కోరుకుంటుంది. బుధవారం వారి స్వగ్రామం అయిన బావాపూర్‌లో ఎస్పీ శశిధర్‌రాజు వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈసందర్బంగా మావోయిస్ట్ తల్లి ఎస్పీ శశిధర్‌రాజుతో మాట్లాడారు. కొడుక శ్రీనివాస్ నీవు ఎక్కడ ఉన్న గానీ రా బిడ్డా … జన జీవన స్రవంతిలో కలిసిపోరా … […] The post కొడుకా…లొంగిపో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పెంబి (నిర్మల్) : 1988లో మావోయిస్ట్‌ పార్టీ పట్ల ఆకర్షితుడై వారిలో కలిసిపోయిన పెంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని బావాపూర్ గ్రామానికి చెందిన తూము శ్రీనివాస్ లొంగిపోవాలని ఆయన తల్లి లచ్చవ్వ కోరుకుంటుంది. బుధవారం వారి స్వగ్రామం అయిన బావాపూర్‌లో ఎస్పీ శశిధర్‌రాజు వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈసందర్బంగా మావోయిస్ట్ తల్లి ఎస్పీ శశిధర్‌రాజుతో మాట్లాడారు. కొడుక శ్రీనివాస్ నీవు ఎక్కడ ఉన్న గానీ రా బిడ్డా … జన జీవన స్రవంతిలో కలిసిపోరా … మాతో అందరితో కలిసి ఆనందంగా ఉండురా అంటూ తన ఆవేదనను వ్యక్తిం చేసింది. చివరికి తను మరణిస్తే కనీసం తనకు తలకొరివి పెట్టడానికైన రావాలని కోరుకుంది. అనంతరం ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ శ్రీనివాస్ ఎక్కడ ఉన్న గానీ లొంగిపోయి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్లొం గిపోయితే తన పై ఉన్న రివార్డ్‌ను తనకే అందిస్తామన్నారు.  అంతేకాకుండా లొంగిపోతే ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా ఇచ్చారు. మావోయిస్ట్ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నా తల్లి ఆవేదనను గమనించి లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలువాలని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్ తల్లికి నిత్యవసరల దృష్ట్యా రెండు చీరలు, 25 కిలోల  బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆకుల ఆశోక్‌కుమార్, ఎస్ ఐ భవాణిగౌడ్, బావాపూర్ సర్పంచ్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

SP Sasidhar Raju Meets Maoist Srinivas Family

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొడుకా…లొంగిపో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: