సిసి కెమెరాల కోసం గ్రామస్థుల విరాళం..

సిఐ, ఎస్సైలకు అందజేసిన గ్రామసర్పంచ్   మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్థులతో పాటు గ్రామ సర్పంచ్‌లు కలిసి రూ. 1.60లక్షలు ఎల్లారెడ్డిపేట సిఐ రవీందర్, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌లకు బుధవారం అందించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ… ఇటీవల నారాయణపూర్ గ్రామంలో పోలీసు బృందంచే కళాబృందం ప్రదర్శన ఇవ్వడం జరిగిందన్నారు. దానికి స్పందించిన సర్పంచ్ నిమ్మలక్ష్మినారాయణరెడ్డి రూ. 25వేలు, గ్రామస్థులు మరో 1.35లక్షలు […] The post సిసి కెమెరాల కోసం గ్రామస్థుల విరాళం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిఐ, ఎస్సైలకు అందజేసిన గ్రామసర్పంచ్

 

మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్థులతో పాటు గ్రామ సర్పంచ్‌లు కలిసి రూ. 1.60లక్షలు ఎల్లారెడ్డిపేట సిఐ రవీందర్, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌లకు బుధవారం అందించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ… ఇటీవల నారాయణపూర్ గ్రామంలో పోలీసు బృందంచే కళాబృందం ప్రదర్శన ఇవ్వడం జరిగిందన్నారు. దానికి స్పందించిన సర్పంచ్ నిమ్మలక్ష్మినారాయణరెడ్డి రూ. 25వేలు, గ్రామస్థులు మరో 1.35లక్షలు కలిపి మొత్తం రూ. 1.60లక్షలను అందించినట్లు తెలిపారు. సిసి కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేసి గ్రామాల్లో శాంతి భధ్రతల రక్షణకు ఇటీవల కాలంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రజలు ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామానికి ఉపయోగకరమైన పనులకు చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నిమ్మ నారాయణరెడ్డి, నిమ్మ బాల్‌చందర్‌రెడ్డి, బాబు తదితరులు ఉన్నారు.

 

Villagers Donation for Cameras in Narayanapur

The post సిసి కెమెరాల కోసం గ్రామస్థుల విరాళం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: