పింఛన్ అందక వికలాంగుల పాట్లు…

సదరం పత్రం ఒకరిది ఆధార్‌ నంబర్ ఇంకొకరిది ఆఫీసుల చుట్టు తిరుగుతున్న పట్టించుకోని అధికారులు   మనతెలంగాణ/పెద్దపల్లి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం నెల నెల ఇస్తున్న పింఛన్ లు అందక వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా సంబందిత ఆఫీసుల చుట్టు తిరుగుతున్న ఫలితం లేకుండా పోయింది. అసలు ఎందుకు రావటం లేదని ఆరా తీయగా ఒకరి పేరుకు బదులుగా ఇంకొకరి పేరు ఇలా ముగ్గురి పేర్లు వేరువేరుగా పడటంతో వారు ఖంగుతిన్నారు. […] The post పింఛన్ అందక వికలాంగుల పాట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సదరం పత్రం ఒకరిది ఆధార్‌ నంబర్ ఇంకొకరిది
ఆఫీసుల చుట్టు తిరుగుతున్న పట్టించుకోని అధికారులు

 

మనతెలంగాణ/పెద్దపల్లి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం నెల నెల ఇస్తున్న పింఛన్ లు అందక వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా సంబందిత ఆఫీసుల చుట్టు తిరుగుతున్న ఫలితం లేకుండా పోయింది. అసలు ఎందుకు రావటం లేదని ఆరా తీయగా ఒకరి పేరుకు బదులుగా ఇంకొకరి పేరు ఇలా ముగ్గురి పేర్లు వేరువేరుగా పడటంతో వారు ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి కి చెందిన కుమ్మరి రాజు తండ్రి శ్రీనివాస్ పుట్టు చెవుడు ఉండటంతో సదరం క్యాంపులో సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ గత ఐదు నెలలుగా పింఛన్ రావటం లేదని సంబందిత డిఆర్‌డివో కార్యాలయంకు రాగా , వారు ఎందుకని ఆధార్‌తో పాటు సదరం క్యాంపులో ఇచ్చిన సర్టిఫికేట్‌ను పరిశీలించగా అదే గ్రామానికి చెందిన ఎంజాల రాజు తండ్రి.శ్రీనివాస్ కు చెందిన ఆధార్ కార్డు నెంబర్ తో నమోదు చేశారు. దీనితో ఎంజాల రాజును పిలిపించి అడగాగ మరోక వింత సమస్య వచ్చి పడింది. గత నాలుగు నెలలుగా ఎంజాల రాజుకు కూడ పింఛన్ రావటం లేదు. అంతేకాక తండ్రి పేరు శ్రీనివాస్‌కు బదులు తాత రాంచంద్రం పేరు పడింది. ఎంజాల శ్రీనివాస్ పింఛన్ ఎందుకు రాలేదని సదరం సర్టిఫికేట్‌తో పాటు ఆధార్ పరీశీలించగా అదే గ్రామానికి చెందిన గుండా రాజు తండ్రి నర్సయ్య ఆదార్ కార్డుకు లింక్ అయింది. దీనితో ఇలా ఎంత మంది పేర్లు ఒకరికి బదులు ఇంకొకరి పేర్లు పడ్డాయోనని ఆందోళన చెందారు. అంతేకాక గత మూడు నెలలుగా తిరుగుతున్న పట్టించుకోక పోగా బుదవారం ఉదయం వచ్చి అధికారిని కలిశారు. కానీ మళ్లీ వస్తాను అని బయటకు పోయి మద్యాహ్నం వరకు కూడ రాకపోవటంతో వికలాంగులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. వికలాంగులపై కూడ ఇంత కనికరం లేదని వారు వాపోయారు. అయిన అధికారుల్లో మాత్రం స్పందన కరువైంది.

 

 

 

Pension Not Give to Disability Persons in Peddapalli

 

The post పింఛన్ అందక వికలాంగుల పాట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: