ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు …ఊపిరి పీల్చుకున్న అధికారులు

ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా లో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజుల పాటు జిల్లాలో మూడు విడతల వారిగా మూడు మండలాల చొప్పున ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో వెంకటాపురం(నూగూరు), వాజేడు రెండో విడతలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, మూడో విడతలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేటలలో ఎన్నికలు జరిగాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి మూడు విడతల పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ మూడు విడతల పరిషత్ […] The post ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు … ఊపిరి పీల్చుకున్న అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా లో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజుల పాటు జిల్లాలో మూడు విడతల వారిగా మూడు మండలాల చొప్పున ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో వెంకటాపురం(నూగూరు), వాజేడు రెండో విడతలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, మూడో విడతలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేటలలో ఎన్నికలు జరిగాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి మూడు విడతల పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ మూడు విడతల పరిషత్ ఎన్నికలకు పోలీసు అధికారులు ఎన్నికలు జరిగే సమయంలో నెల రోజుల పాటు కూంబ్లింగ్ లు నిర్వహించి మండలాలల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులకు , ఓటర్లకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిషత్ ఎన్నికలకు ప్రణాళికలు తయారు చేసి మండలాల వారిగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏ కేంద్రాల్లో అధికారులను ఏవిధంగా ఉండాలనే ప్రణాళికలు  చేసి  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేశారు. ములుగు జిల్లాలో మూడువిడతల వారిగా పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిషత్ ఎన్నికలు మే 27 వ తేదిన లెక్కించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ,ఎన్నికల పరిశీలకులు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ధీమాలో ఉన్నాయి.

Parishad Elections Held With Peaceful In Mulugu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు … ఊపిరి పీల్చుకున్న అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: