ప్రియుడి కోసం…విడాకుల పత్రాలు సృష్టించిన భార్య

  ముంబయి: ప్రియుడి మోజులో పడి భర్తతో విడాకులు తీసుకున్నట్టు ఫోర్జరీ సంతకంతో డాక్యుమెంట్లు తయారు చేసిన సంఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నీలోఫర్ , యూసుఫ్ షరీప్ మస్తాన్ అనే దంపతులు ముంబ్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. బతుకుదెరువు కోసం మస్తాన్ 2007లో యుఎఇకి వలసపోయాడు. అప్పటికే దంపతులకు కుమారుడు ఉన్నాడు. భర్త స్థానికంగా లేకపోవడంతో నీలోఫర్ మాజీ ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో భర్త నుంచి విడాకులు […] The post ప్రియుడి కోసం… విడాకుల పత్రాలు సృష్టించిన భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: ప్రియుడి మోజులో పడి భర్తతో విడాకులు తీసుకున్నట్టు ఫోర్జరీ సంతకంతో డాక్యుమెంట్లు తయారు చేసిన సంఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నీలోఫర్ , యూసుఫ్ షరీప్ మస్తాన్ అనే దంపతులు ముంబ్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. బతుకుదెరువు కోసం మస్తాన్ 2007లో యుఎఇకి వలసపోయాడు. అప్పటికే దంపతులకు కుమారుడు ఉన్నాడు. భర్త స్థానికంగా లేకపోవడంతో నీలోఫర్ మాజీ ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిడమేకాకుండా భర్త పేరుపై ఉన్న ఇల్లును 20 లక్షల రూపాయలకు అమ్మేసింది. మస్తాన్ గత సంవత్సరం ఇంటికి వచ్చినప్పుడు భార్య ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి నిలదీశాడు. తన స్నేహితుడని చెప్పి మాటమార్చింది. 2019లో మస్తాన్ ఇంటికి వచ్చినప్పుడు భర్తతో గొడవకు దిగడంతో ఓ లాడ్జీలో బస చేశాడు. భార్య గురించి వాకబు చేశాడు. భర్తతో విడాకులు తీసుకున్నానని పత్రాలు చూపించడంతో మస్తాన్ అవాక్కయ్యాడు. దీంతో ఫేక్ విడాకులు పత్రాలు తీసుకొని పోయి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నీలోఫర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో నీలోఫర్ దోషిగా తేలితే ఏడేళ్లు కారాగార శిక్ష పడొచ్చని పోలీసులు పేర్కొన్నారు.

 

Wife Created Fake Divorce Documents for Lover

 

Wife Created Fake Divorce Documents for Lover

 

The post ప్రియుడి కోసం… విడాకుల పత్రాలు సృష్టించిన భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: