‘పది’నిసలు…!

విద్యలలో విలసిల్లే లక్షణం ఆ వ్యక్తి లేదా ఆ నేల సంపూర్ణ వికాసానికి దారి తీస్తుంది. కీలకమైన పరీక్షల్లో అపూర్వమైన ఫలితాలు సాధించడానికి విద్యార్థి కృషితోపాటు వ్యవస్థాగత సౌకరాలు సైతం కారణమవుతాయి. సోమవారం నాడు వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఇంతకుముందెన్నడూ లేనంత అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని రాష్ట్ర విద్యార్థులు నమోదు చేసుకోడం ఎంతైనా హర్షించవలసిన పరిణామం. ఇది రాష్ట్రంలో పాఠశాల విద్య ఖ్యాతిని అనూహ్యంగా పెంచింది. ఇంటర్మీడియెట్ పేపర్లు దిద్దడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ మిన్నంటిన […] The post ‘పది’నిసలు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విద్యలలో విలసిల్లే లక్షణం ఆ వ్యక్తి లేదా ఆ నేల సంపూర్ణ వికాసానికి దారి తీస్తుంది. కీలకమైన పరీక్షల్లో అపూర్వమైన ఫలితాలు సాధించడానికి విద్యార్థి కృషితోపాటు వ్యవస్థాగత సౌకరాలు సైతం కారణమవుతాయి. సోమవారం నాడు వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఇంతకుముందెన్నడూ లేనంత అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని రాష్ట్ర విద్యార్థులు నమోదు చేసుకోడం ఎంతైనా హర్షించవలసిన పరిణామం. ఇది రాష్ట్రంలో పాఠశాల విద్య ఖ్యాతిని అనూహ్యంగా పెంచింది. ఇంటర్మీడియెట్ పేపర్లు దిద్దడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ మిన్నంటిన నేపథ్యంలో పదో తరగతిలో అసాధారణ ఫలితాల సాధన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. పదో తరగతిలో ఇంతవరకు అత్యధిక ఉత్తీర్ణత 85 శాతం దాటలేదు. 2016లో అత్యధికంగా 84.63 శాతం నమోదయింది. అంతకంటే 8.65 శాతం పెరిగి ఈ ఏడాది పది పరీక్షల ఉత్తీర్ణత 92 శాతాన్ని మించి రికార్డు కావడం కలా, నిజమా అనిపించింది.

జెఇఇ (2019) మెయిన్స్‌లో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సాధించినట్టుగానే పదో తరగతి ఫలితాల్లో బిసి గురుకులాలు అమోఘమైన ఫలితాలను మూటగట్టుకోడం గమనించవలసిన అంశం. తెలంగాణ సాంఘిక, గిరిజన గురుకుల విద్యాసంస్థల సంఘాల నుంచి ఈ ఏడాది మొదటిసారిగా 506 మంది విద్యార్థులు జెఇఇలో పాస్ అవగా పది ఫలితాల్లో బిసి గురుకుల సంక్షేమ విద్యార్థులు 98.78 శాతం ఉత్తీర్ణ త సాధించి అనితరమైన ప్రతిభను చాటుకున్నారు. 98 శాతం పాస్‌తో గురుకుల, మోడల్ పాఠశాలల విద్యార్థులు తరువాతి స్థానంలో వచ్చారు. సోషల్ వెల్ఫేర్, కస్తూర్బా విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలలే 84.38 శాతంతో అధమ స్థానంలో రావడం గమనార్హం. దీనిని బట్టి ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయ వర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పెషల్ క్లాసుల వంటివి నిర్వహించిన చోట విశేష ఫలితాలు, మామూలుగా ఆషామాషీగా పాఠాలు చెప్పి చేతులు దులుపుకుంటున్న స్కూళ్లల్లో సాధారణమైన రిజల్స్ వస్తున్నట్టు రుజువవుతున్నది.

కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే అంటే ఇదే మరి! పరీక్షలొస్తున్నాయంటే నిద్రాహారాలు మాని చదవడం ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మీద ప్రత్యేక కన్ను ఉంచి అలా చదివేలా చేయడం జరగాలి. ఈ అలవాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విషయంలో కుంటుపడినట్టు అర్థమవుతున్నది. అలాగని రుబ్బుడు చదువులే మంచివని చెప్పడం కాదు. విషయాన్ని విద్యార్థికి అవగాహన పరిచి జ్ఞాపకంలో ఉంచుకొనేలా చేయడం మంచి పద్ధతి. ఇది ప్రభుత్వ స్కూళ్లల్లో బొత్తిగా లోపించి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తున్న గురుకులాలు, ఆదర్శపాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు వంటి వాటిల్లో పకడ్బందీగా సాగుతున్నట్టు ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు చాటుతున్నాయి. పాఠ్యాంశాలపట్ల దృష్టి కేంద్రీకరించి కృషి చేస్తే ఆశ్చర్యపడే స్థాయి ఉత్తమ ఫలితాలు అసాధ్యం కావు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు పై చదువులకు వెళ్లి అక్కడ రాణించాలంటే, మహోన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలంటే పునాది చదువైన పాఠశాల విద్యలో మంచి ఫలితాలు తెచ్చుకోవలసి ఉన్నది. ఆర్థిక వెనుకబాటు కారణంగా వారు ఆశ్రయించే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు విశేష స్థాయిలో పెరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. అది జరిగినప్పుడే ప్రైవేటు విద్యా సంస్థలపై మోజు తగ్గి ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు పెరుగుతుంది. సంక్షేమ, గురుకుల, మోడల్ పాఠశాలల్లో యాజమాన్యాలు చూపే మాదిరి శ్రద్ధాసక్తులు ప్రభుత్వం అమితంగా ఖర్చు చేసి నడుపుతున్న ప్రభుత్వ పాఠశాలల విషయంలోనూ చూపవలసి ఉన్నది.

విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వ సంస్థల ప్రమాణాలు పెరిగినప్పుడే ప్రైవేటుకు గుండె దడ పుడుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయి. వరుస మూడు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో వస్తున్న జగిత్యాల జిల్లాను ప్రత్యేకించి అభినందించవలసి ఉన్నది. ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు ఇంత అమోఘంగా రావడానికి జిల్లాల సంఖ్య భారీగా పెరిగి వాటి పరిధి తగ్గడం కూడా ఒక కారణమేనని అంటున్నారు. చిన్న జిల్లాలు కావడం వల్ల అధికారులు మెరుగైన పర్యవేక్షణ చూపించగలిగారని వినవస్తున్నది. అలాగే జిల్లా కలెక్టర్లు కూడా ఈసారి పదో తరగతి బోధన మీద దృష్టి సారించారని చెబుతున్నారు. మార్కుల రీత్యా ఉన్నత స్థితిని సాధించడం, ఉత్తీర్ణత శాతం అపూర్వంగా పెరగడమే గాక ఇంటర్మీడియెట్ నుంచి ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యాన్ని, విద్యాపరమైన ప్రతిభను కూడా పదో తరగతి, ఆ కింది చదువుల్లో విద్యార్థులకు దండిగా కల్పించాలి. అప్పుడే వారు ఆత్మహత్యల బాట పట్టడం తొలగుతుంది. దేశానికి మేలు జరుగుతుంది.

Highest percentage in the tenth class results

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘పది’నిసలు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.