మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా

  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లోనూ వెలిగిపోతోంది. బాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని ఇప్పుడు హాలీవుడ్‌లో సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ స్థాయిని సంపాదించుకున్న తాను మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది ప్రియాంక. “అప్పట్లో నేను సినిమాల్లోకి రావాలని ఓ దర్శకనిర్మాతని కలిశాను. అప్పటికే నేను మిస్ వరల్డ్ పోటీలో విన్నర్‌ని. అయితే ఆ దర్శకనిర్మాత మాత్రం నాలో చాలా లోపాలున్నాయన్నాడు. నా ముక్కు సరిగా […] The post మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లోనూ వెలిగిపోతోంది. బాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని ఇప్పుడు హాలీవుడ్‌లో సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ స్థాయిని సంపాదించుకున్న తాను మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది ప్రియాంక. “అప్పట్లో నేను సినిమాల్లోకి రావాలని ఓ దర్శకనిర్మాతని కలిశాను. అప్పటికే నేను మిస్ వరల్డ్ పోటీలో విన్నర్‌ని. అయితే ఆ దర్శకనిర్మాత మాత్రం నాలో చాలా లోపాలున్నాయన్నాడు. నా ముక్కు సరిగా లేదని… అలాగే నా శరీరాకృతి తగిన విధంగా లేదని చెప్పాడు. కానీ ఆతర్వాత మెల్లిగా సినిమాల్లో అవకాశాలను సాధించి ఇప్పుడు టాప్ రేంజ్‌కు చేరుకున్నాను. చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అన్నింటినీ అధిగమించి బాలీవుడ్‌లో స్టార్‌గా రాణించి ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా నటిగా సత్తాచాటుతుండడం ఎంతో ఆనందంగా ఉంది” అని చెప్పింది ప్రియాంక.

I have faced many problems in career beginning: priyanka

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: