గోవాలో ఆటా పాట

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గోవాలో రామ్, నభా నటేశ్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ నృత్య రీతులను సమకూరుస్తున్నారు. అయితే రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతాన్ని […] The post గోవాలో ఆటా పాట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గోవాలో రామ్, నభా నటేశ్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ నృత్య రీతులను సమకూరుస్తున్నారు. అయితే రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌కు జోడీగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః రాజ్ తోట, ఎడిటర్‌ః జునైద్ సిద్దిఖీ, ఆర్ట్‌ః జానీ షేక్, ఫైట్స్‌ః రియల్ సతీష్, సాహిత్యంః భాస్కరభట్ల.

Ismart shankar teaser releasing tomorrow

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గోవాలో ఆటా పాట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: