అది దారుణమైన విషయం

సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఏ విషయంపైన అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. తాజాగా మరోసారి ముక్కుసూటిగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భామ ఇండస్ట్రీలోని హీరోయిన్‌ల పరిస్థితిపై గళమెత్తింది. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోలకే కట్టబెట్టడం తగదని విమర్శించిన శృతి… తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం స్వాగతించదగ్గ పరిణామంగా పేర్కొంది. ఇక పెళ్లయిన హీరోయిన్‌లు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అలాగే తన విషయంలో అలా జరగదని శృతిహాసన్ […] The post అది దారుణమైన విషయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఏ విషయంపైన అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. తాజాగా మరోసారి ముక్కుసూటిగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భామ ఇండస్ట్రీలోని హీరోయిన్‌ల పరిస్థితిపై గళమెత్తింది. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోలకే కట్టబెట్టడం తగదని విమర్శించిన శృతి… తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం స్వాగతించదగ్గ పరిణామంగా పేర్కొంది. ఇక పెళ్లయిన హీరోయిన్‌లు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అలాగే తన విషయంలో అలా జరగదని శృతిహాసన్ పేర్కొనడం విశేషం. “హీరోయిన్‌లు పెళ్లయ్యాక భర్తకు ఇష్టం లేదనో, అత్తగారు వద్దన్నారోనని సినిమాలకు దూరమవడం దారుణమైన విషయం. యాక్టింగ్‌ను కూడా ఇతర ఉద్యోగాల్లాగే చూడాలి. నేను మాత్రం పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా నటిస్తూనే ఉంటా. నటన అంటే నాకెంతో ఇష్టం”అని శృతిహాసన్ పేర్కొంది.

I will continue acting after marriage: shruti haasan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అది దారుణమైన విషయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: