ఆ బాధ్యతను తీసుకున్నారు

అఖిల్ అక్కినేని కొత్త సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరోకు మంచి విజయాన్ని అందించే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నారట. దర్శకుడు ’బొమ్మరిల్లు’ భాస్కర్ మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడంతో ఈ సినిమాను అఖిల్ కోసం సెట్ చేశారట. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాకు అల్లు అరవింద్ రూ. […] The post ఆ బాధ్యతను తీసుకున్నారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అఖిల్ అక్కినేని కొత్త సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరోకు మంచి విజయాన్ని అందించే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నారట. దర్శకుడు ’బొమ్మరిల్లు’ భాస్కర్ మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడంతో ఈ సినిమాను అఖిల్ కోసం సెట్ చేశారట. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాకు అల్లు అరవింద్ రూ. 20 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని.. అన్ని విషయాల్లో పొదుపు చర్యలు పాటించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ బడ్జెట్ తో సినిమాకు రిచ్ ఫీల్ రాదనే ఉద్దేశంతో నాగార్జున అదనంగా ఎంత బడ్జెట్ అవుతుందో అదంతా తాను ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అయితే గీతా ఆర్ట్ వర్గాల వారు మాత్రం ఇవన్నీ గాసిప్స్ మాత్రమే అని తేల్చేస్తున్నారు. సినిమా కథకు అవసరమైనంత బడ్జెట్‌ను ఖర్చుపెడుతున్నారని అంటున్నారు. గతంలో అఖిల్ సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ స్క్రిప్ట్ మేరకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించారని చెప్పారు. మరొక విషయం ఏమిటంటే అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో నాగార్జున జోక్యం చేసుకోవడం లేదట. అల్లు అరవింద్ పై నమ్మకంతో ఆయన ఉన్నారట.

Akhil, bommarillu bhaskar movie with budget 20 Crore!

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ బాధ్యతను తీసుకున్నారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: