‘సాహో’ కోసం మొదటిసారి…

స్టార్ హీరో ప్రభాస్ చిత్రం ‘సాహో’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత ఈ కథానాయకుడి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అధిక శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సాహో’ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో ‘సాహో’ ప్రమోషన్ కోసం ప్రభాస్ […] The post ‘సాహో’ కోసం మొదటిసారి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

స్టార్ హీరో ప్రభాస్ చిత్రం ‘సాహో’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత ఈ కథానాయకుడి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అధిక శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సాహో’ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో ‘సాహో’ ప్రమోషన్ కోసం ప్రభాస్ జాతీయ మీడియాకు కూడా అందుబాటులోకి రాబోతున్నారు.

ఈ చిత్రం కోసం అతను మొదటిసారి హిందీ డబ్బింగ్ స్వయంగా చెప్పబోతున్నారు. దీని కోసం ప్రభాస్‌కు ఓ హిందీ టీచర్ నెలరోజుల పాటు ఏకధాటిగా ట్యూషన్ చెప్పిందట. ఆతర్వాత నమ్మకం కుదిరాకే హిందీలో స్వంతంగా డబ్బింగ్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారట ప్రభాస్. నిజానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలు స్ట్రెయిట్ గా హిందీ సినిమాలు చేసినా డబ్బింగ్ మాత్రం చెప్పలేదు. కానీ ప్రభాస్ ఇంత ధైర్యంగా సిద్ధమయ్యారంటే బాగానే ప్రిపేర్ అయినట్టే. ఇక ‘సాహో’ విడుదల తేదీ ఖరారైతే దాన్ని బట్టి అభిమానులు సంబరాలకు సిద్ధమవుతారు.

Prabhas dubbing for Saaho hindi version

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘సాహో’ కోసం మొదటిసారి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: