చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

కరీంనగర్‌ : కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో సోమవారం ఉదయం  విషాద సంఘటన జరిగింది. ఇంటి ముందు నిద్రిస్తున్న చిన్నారులపైకి ఓ ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మీబాయి(7) అనే చిన్నారి మృతి చెందింది.  రాము(7) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాము పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మీబాయి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రివర్స్ తీస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ చిన్నారులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన […] The post చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్‌ : కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో సోమవారం ఉదయం  విషాద సంఘటన జరిగింది. ఇంటి ముందు నిద్రిస్తున్న చిన్నారులపైకి ఓ ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మీబాయి(7) అనే చిన్నారి మృతి చెందింది.  రాము(7) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాము పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మీబాయి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రివర్స్ తీస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ చిన్నారులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Girl Dead in Road Accident at Elagandala In Karimanagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: