మండుతున్న ఎండలతో ప్రజల పరేషాన్

ఆర్మూర్(నిజామాబాద్):  భానుడి ప్రతాపంతో పగటి ఉష్ణోగ్రత తీవ్రస్థాయికి చేరుకుంది. ఆదివారం అత్యధికంగా జిల్లాలో డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 6.30 నుంచే ఎండలు మండుతుండడంతో జనం 9గంటలకే రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. అర్థరాత్రి వరకు ఉక్కపోత ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  ఉదయం నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం 5గంటలైన ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. అర్థరాత్రి 12గంటల వరకు వాతావరణంలో మార్పురాక […] The post మండుతున్న ఎండలతో ప్రజల పరేషాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆర్మూర్(నిజామాబాద్):  భానుడి ప్రతాపంతో పగటి ఉష్ణోగ్రత తీవ్రస్థాయికి చేరుకుంది. ఆదివారం అత్యధికంగా జిల్లాలో డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 6.30 నుంచే ఎండలు మండుతుండడంతో జనం 9గంటలకే రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. అర్థరాత్రి వరకు ఉక్కపోత ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  ఉదయం నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం 5గంటలైన ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. అర్థరాత్రి 12గంటల వరకు వాతావరణంలో మార్పురాక ఉక్కపోతతో సతమతమవుతున్నారు. రాత్రి కరెంట్ పోతే చిన్నపిల్లలు, పెద్దలు కరెంటు వచ్చే వరకు బయట పడిగాపులు కాస్తున్నారు. కరెంట్ ఉంటేనే నిద్ర, లేకుంటే జాగారమే చేయాల్సి వస్తోంది. తీవ్ర ఎండలకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలతో పడరాని పాట్లు పడుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం శీతాల పానీయాలు, లస్సీలు, కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, కర్బూజ, నిమ్మరసం, మజ్జిగ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎండల తీవ్రత ప్రజల  ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
పెరుగుతున్న ఎండలు ప్రజల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతున్నాయి. క్రమంగా పెరుగుదల ఉంటే శరీరం అలవాటు పడుతుంది. కానీ అతి తక్కువ సమయంలో ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఎండలు మండిపోతుండడంతో అవసరమైతేనే తప్ప బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరై బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

People Suffer From Hot Summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మండుతున్న ఎండలతో ప్రజల పరేషాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: