తినకుండా ఉండగలరా…?

  సఫల తెలంగాణ మధుర మామిడి 40, 50 ఏళ్ల కిందే సీలింగ్ యాక్ట్ నుంచి తప్పించుకునేందుకు భూస్వాములు ఎక్కువ ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లుతోంది. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే మామిడితో అనేక లాభాలు సాధించవచ్చునని ఉద్యాన శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 70శాతం నుంచి 80 శాతం మామిడి రైతులు వారి తోటల్లో ఉండటం లేదు. ఎవరికో ఒకరికి అప్పజెప్పడం లేదా జీతగాళ్లను పెట్టుకుంటున్నట్లు ఉద్యాన శాఖ మామిడిపై చేసిన […] The post తినకుండా ఉండగలరా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సఫల తెలంగాణ మధుర మామిడి

40, 50 ఏళ్ల కిందే సీలింగ్ యాక్ట్ నుంచి తప్పించుకునేందుకు భూస్వాములు ఎక్కువ ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లుతోంది. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే మామిడితో అనేక లాభాలు సాధించవచ్చునని ఉద్యాన శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 70శాతం నుంచి 80 శాతం మామిడి రైతులు వారి తోటల్లో ఉండటం లేదు. ఎవరికో ఒకరికి అప్పజెప్పడం లేదా జీతగాళ్లను పెట్టుకుంటున్నట్లు ఉద్యాన శాఖ మామిడిపై చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. మామిడి సాగు చేస్తున్న రాష్ట్రాలలో ఉత్పత్తిపరంగా మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మామిడి తోటలు ఉన్నాయి. తరువాత స్థానం జగ్యితాలది 30,8885 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 19,603, మంచిర్యాల 17,660, నాగర్‌కర్నూల్ 15,453 ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. రాష్ట్రంలో సరాసరి ఉత్పాదకత ఎకరానికి 3.5 మెట్రిక్ టన్నులుగా ఉంది. బంగినపల్లి, తోతాపురి, కోతకాయలు, నీలాలరకం, దశేరి వంటి రకాలు అధిక ప్రాచుర్యంలో ఉన్నాయి. గతంలో మామిడి పళ్లు చెట్ల మీదనే సహజ సిద్ధంగా పండేవి. కానీ ప్రస్తుతం మామిడి కాయలను తీసుకొచ్చి రసాయ నాల ద్వారా మక్కబెడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు.

ఫల జాతుల్లో రారాజు, పసందైన ఫలరాజు.. ఆయురారోగ్య సుగుణాలున్న ”అమృతఫలం”.. “అక్షయఫలం”. సీజన్ ఫ్రూట్ అయినప్పటికీ… ఆవకాయ పచ్చడి రూపంలో ఏడాదంతా ఇంట్లో ఉండేది.. మామిడిని చూస్తే మనకు తెలియకుండానే నోరూరుతుంది.. రుచికే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లకూ ప్రసిద్ధి మామిడి. మన రాష్ట్రంలో మామిడి తోటల సాగులో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది.. సంప్రదాయ తోటలకు చెక్ పెట్టి, శాస్త్రీయంగా హై డెన్సిటీలో మామిడి తోటల సాగుపై ఉద్యాన శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు వెళ్తోంది.. రైతులకు లాభాలు వచ్చేలా.. ఉత్తరాది రాష్ట్రాల అవసరాలు తీర్చడమే కాదు.. విదేశాలకు నేరుగా ఎగుమతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో వినియోగం 1.85 శాతమే
రాష్ట్రంలో 3.52 కోట్ల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఇందులో ఫలరాజు మామిడిని తింటున్న వారి సంఖ్య అక్షరాల కోటి 21 లక్షలు మాత్రమే. 36.63 శాతం కుటుంబాలు మామాడిని తింటుండగా, సగటున నెలకు ఒక్కరు 390 గ్రాములు మాత్రమే తింటున్నారు. ఇలా ఒక నెలకు రాష్ట్రానికి 4,745 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ లెక్కన నాలుగు నెలలకు 18,980 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇక్కడ పండే మొత్తం మామిడిలో కేవలం 1.85 శాతం మామిడినే రాష్ట్రంలో తింటున్నట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సర్వే ప్రకారం ఉద్యాన శాఖ తయారు చేసిన నివేదికలో స్పష్టమౌతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.89 లక్షల ఎకరాల్లో 10.23 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండుతున్నది. 10.04 లక్షల మెట్రిక్ టన్నులు మిగులుగా తేలుతోంది. ఇది ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మన బంగినపల్లి మామిడికి ఉత్తరాదిలో మంచి డిమాండ్ ఉంది. ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. దాదాపు 3 వేల మెట్రిక్ టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి అవుతుందని అంచనా.

మన తోటలు ఇప్పటివి కాదు
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మామిడి ఉన్న తోటలను సంప్రదాయంగా సాగు చేస్తున్నారు. 40, 50 ఏళ్ల కిందే సీలింగ్ యాక్ట్ నుంచి తప్పించుకునేందుకు భూస్వాములు ఎక్కువ ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లుతోంది. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే మామిడితో అనేక లాభాలు సాధించవచ్చునని ఉద్యాన శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 70శాతం నుంచి 80 శాతం మామిడి రైతులు వారి తోటల్లో ఉండటం లేదు. ఎవరికో ఒకరికి అప్పజెప్పడం లేదా జీతగాళ్లను పెట్టుకుంటున్నట్లు ఉద్యాన శాఖ మామిడిపై చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. మామిడి సాగు చేస్తున్న రాష్ట్రాలలో ఉత్పత్తిపరంగా మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మామిడి తోటలు ఉన్నాయి. తరువాత స్థానం జగ్యితాలది 30,8885 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 19,603, మంచిర్యాల 17,660, నాగర్‌కర్నూల్ 15,453 ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. రాష్ట్రంలో సరాసరి ఉత్పాదకత ఎకరానికి 3.5 మెట్రిక్ టన్నులుగా ఉంది. బంగినపల్లి, తోతాపురి, కోతకాయలు, నీలాలరకం, దశేరి వంటి రకాలు అధిక ప్రాచుర్యంలో ఉన్నాయి. గతంలో మామిడి పళ్లు చెట్ల మీదనే సహజ సిద్ధంగా పండేవి. కానీ ప్రస్తుతం మామిడి కాయలను తీసుకొచ్చి రసాయ నాల ద్వారా మక్కబెడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు.

దేశంలో… ప్రపంచలో మామిడి ఇలా
మ్యాంగో అనేది ఆంగ్ల పదం. ఈ పదం కూడా మన దేశంలోని కేరళకు చెందిన ”మంగ” అనే పదం నుంచే వచ్చింది. స్వాతంత్య్రం రాక ముందు మన దేశాన్ని పా లించిన పోర్చుగీసు వారు ఈ ఫలాన్ని మ్యాంగో అని పిలిచేవారు. మన దేశంలో పుట్టిన మామిడి పళ్లకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. భారత దేశంలో పుట్టిన మామిడి 5వ శతాబ్దంలో తూర్పు ఆసియాకు పాకింది. ఆ తరువాత తూర్పు ఆఫ్రికాకు చేరుకుంది. అమెరికా వారికి మాత్రం ఈ పండు 18వ శతాబ్దంలో పరిచయమైంది. మన దేశంలో మామిడి చెట్లు 300ఏళ్లు బతికిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51.33 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏడాది 2.09 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మామిడి ఉత్పత్తిలో మన దేశ వాటానే 40 శాతంగా ఉండటం విశేషం. దిగుబడి విషయంలోనే మన దేశం వెనకబడి ఉంది.

తింటే ఆరోగ్యం..
మామిడి పళ్లు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తల్లిలా ఎంతో మేలు చేస్తాయి. సీజన్‌లో మామిడి పళ్లను తినడం ద్వారా చర్మ క్యాన్సర్ మన దరిచేరకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పెద్ద వయసు వారిలో అధిక రక్తపోటు, రక్తహీన తలు తొలిగిపోతాయి. మూత్ర సంబంధ వ్యాధులకు కూడా మామిడి మంచి దివ్య ఔషధం. జీర్ణశక్తిని పెంచుతుంది. ము ఖంపై వచ్చే మొటిమలను మటుమాయం చేస్తూ చర్మపు నునుపుదనాన్ని పెంచే గుణం కూడా మామిడికి ఉంది. కడుపులోని నులి పురుగులను మామిడి నివారిస్తుంది. మామిడి పండు వల్ల వైరల్ జ్వరాలు, దగ్గు, పడిసం, సెప్టిక్ సమస్య లు, గుండె సంబంధ రుగ్మతలు, అస్తమా, హైపర్‌టెన్షన్, క డుపు నొప్పి, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ట్యూమర్లు, అల్సర్లు వంటి వ్యాధులు తగ్గిపోతాయి.

వేడి వేడి అన్నంలో ఎంతో రుచి పచ్చడి
మామిడి ఆవకాయ ఏడాదంతా ఇంట్లోనే ఉంటుంది. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఆవకాయ పేరు వినగానే వారికి ప్రాణం లేచి వచ్చినట్లు వుంటుంది. వేసవి సీజన్‌లో ఆవకాయ పెట్టకుంటే సంవత్సర కాలం మొత్తం ఆహారంలోకి ఉపయోగపడుతుంది. తాతల తండ్రుల నుండి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఒక ముద్దయినా మామిడి కాయ పచ్చడితో తినందే తినే భోజనం తృప్తి అనిపించదు. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళేవారు అక్కడ నివసిస్తున్న తెలుగు వారు ఇండియా నుండి రాకపోకలు సాగించేటప్పుడు ఆవకాయ పచ్చడి తప్పనిసరిగా లగేజీలో పెట్టుకుంటారు. విదేశీయులకు కూడా రుచి చూపించడంతో తెలుగు ఆవకాయకు విదేశాల్లో ఫ్యాన్స్ తయారయ్యారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

రైతుల కంటే వ్యాపారులకే లాభాలు
మామిడి రైతుల కంటే ట్రేడర్స్ ఎక్కువ లాభాలు పొందుతున్నట్లు ఉద్యాన శాఖ నివేదికలో తేలింది. రైతులు ఒక కిలో మామిడి పండుకు రూ.5 పొందుతుంటే, అదే వ్యాపారులు కిలో మామిడి పండ్లను రూ.30కి విక్రయిస్తున్నారు.మొత్తం మామిడి ఉత్పత్తిలో 80 శాతం కాయ కోతకు ముందే జనవరి నుంచి మార్చి నెలలోపు గంప గుత్త కింద అర్రసు పాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా కొందరు సంప్రదాయ ట్రేడర్స్ మధ్యనే సాగుతోంది.

175 మహిళా ఉత్పత్తిదారుల సంఘాలు
మామిడి రైతులకు లాభాలు కల్పించేందుకు ఉద్యాన శాఖ, వర్సిటీతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీల ఆధ్వర్యంలో 175 మామిడి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇందులో మొత్తం 2850 మంది మహిళా మామిడి రైతులు ఉన్నారు. వీరికి మామిడి కాయలు కోయడం, గ్రేడింగ్, ప్యాకింగ్‌తో పాటు శిక్షణా ఇచ్చారు. కొనుగోలుదారులు, అమ్మకపుదారులను ఒకే వేదిక మీదకు తీసుకుని వచ్చి, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేసి మామిడి రైతులకు తగిన ధర కల్పించడమే లక్షంగా ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు.

హై డెన్సిటీ ప్లాంటింగ్.. ప్యాక్ హౌస్‌లు
రాష్ట్రంలో మామిడి ఉత్పత్తిని మరింతగా పెంచి, రైతులకు లాభాలు వచ్చేలా రావాలంటే శాస్త్రీయ పద్ధతిలో మామిడి తోటల సాగు ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కొత్త రకం మామిడిని హై డెన్సిటిలో నాటుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించుకోవడంతో పాటు గ్యాప్ ప్రాక్టీస్‌లు చేయడం ద్వారా మంచి ఉత్పత్తితో పాటు నాణ్యత కలిగిన మామిడి పండ్లు పండించవచ్చని అధికారులు చెబుతున్నారు. చాలా మందికి మామిడి ఎలా కోయాలో తెలియడం లేదని, నైపుణ్య శిక్షణ తీసుకుంటే గ్రేడింగ్, ప్యాకింగ్ చక్కగా చేయడం, రిఫైనింగ్ చాంబర్స్, ప్యాక్ హౌస్‌లు ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తే మంచి ధర వస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో హాట్ వాటర్ ట్రీట్‌మెంట్, వేపర్ హీట్ ట్రీట్‌మెంట్, ఇరిడియేషన్ ఫ్లాంట్లను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల, ఖమ్మం, కొల్హాపూర్‌లలో మ్యాంగో ప్యాక్ హౌస్‌లో ఏర్పాటు చేసుకోవడం తెలుస్తుందన్నారు. బంగినపల్లి మామిడిని శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంటిగ్రేటేడ్ ఆటోమేటిక్ ప్యాక్ హౌస్‌లను జడ్చర్ల, ఖమ్మం, జగిత్యాల, నల్లగొండలలో ఏర్పాటు చేస్తున్నారు.

ఫలరాజు ఉత్పత్తిలో తెలంగాణను రాజుగా నిలబెడతాం

– ఎల్. వెంకట్రామ్ రెడ్డి, ఉద్యాన శాఖ సంచాలకులు

రాష్ట్రంలో మామిడి ఉత్పత్తిని పెంచేందుకు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న తోటలు కాకుండా ఆధునాతన శాస్త్రీయ పద్ధతిలో తోటల సాగు పెంచేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. హై డెన్సిటిలో తోతాపురి, మహారాష్ట్రకు చెందిన అల్ఫోన్స రకం మామిడి చెట్లను నాటడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు. ఇప్పటికే ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వీటిని విజయవంతంగా పెంచాం. కాయ కోత, ప్యాకింగ్, గ్రేడింగ్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తాం. ప్రతి ఏటా వడగండ్లు సాధారణమే. కాకపోతే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో, ఉత్పాదకతలో తెలంగాణను ఉన్నతస్థానంలో నిలబెట్టాలనే లక్షంతో పనిచేస్తున్నాం. ప్యాక్ హౌస్‌లు ఏర్పాటు చేస్తాం. నాటి తోటలు ఎలా ఉన్నాయో.. నేటి తోటలు ఎలా ఉండబోతున్నాయో చేసి చూపిస్తాం.

Mango of the king in fruity species

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తినకుండా ఉండగలరా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.