ప్రేమకు పెన్నిధి.. అనుబంధాల వారధి అమ్మ…

  *ఆత్మీయతానురాగాల చిరునామా మాతృమూర్తి *బిడ్డలే సర్వస్వంగా భావించే త్యాగమయి *ఆమె త్యాగం అజరామరం *భూమిపై బ్రహ్మదేవుడి ప్రతిరూపం అమ్మ *నేడు ప్రపంచ మాతృ దినోత్సవం సిద్దిపేట : అమ్మ లేనిదే బ్రహ్మా కూడా లేడు. అమ్మంటే ఒక అనుబంధం… అమ్మంటే ఒక అనురాగం… ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. ద్వేషించే మనుషులను కూడా ప్రేమించే మనస్సు అమ్మది. తల్లిగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఏ […] The post ప్రేమకు పెన్నిధి.. అనుబంధాల వారధి అమ్మ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

*ఆత్మీయతానురాగాల చిరునామా మాతృమూర్తి
*బిడ్డలే సర్వస్వంగా భావించే త్యాగమయి
*ఆమె త్యాగం అజరామరం
*భూమిపై బ్రహ్మదేవుడి ప్రతిరూపం అమ్మ
*నేడు ప్రపంచ మాతృ దినోత్సవం

సిద్దిపేట : అమ్మ లేనిదే బ్రహ్మా కూడా లేడు. అమ్మంటే ఒక అనుబంధం… అమ్మంటే ఒక అనురాగం… ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. ద్వేషించే మనుషులను కూడా ప్రేమించే మనస్సు అమ్మది. తల్లిగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఏ పాత్రలోనైన అప్యాయత, అనురాగాలు పంచే అమృత హృదయం. తను ఆకలితో పస్తులు ఉం టూ బిడ్డ కడుపు నింపే అమృతమయి. బుడిబుడి అడుగుల సమయంలో చేయూతనిచ్చి వెన్నంటి నిలిచి ధైర్యానిస్తుంది. జీవితాన్ని తీర్చుదిద్దుకున్నాక నీడలా అనుసరిస్తూ భరోసా కల్పిస్తుంది. ఆమె త్యాగం అజరామరం. ఆమె ప్రేమ అనన్యసామాన్యం. ఏడాదికి ఒక్కసారైన అమ్మ ప్రేమను గుర్తుంచుకోవడం, ఆమె త్యాగాలను స్మరించుకోవడం మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది లేనిది మననం చేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత.

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. అమ్మ శక్తి స్వరూపిని. మాతృదేవోభవ అన్నది అందుకే. త్యాగం, ఆత్మీయత, అనురాగాల చిరునామా అమ్మ. ఆమె పిలుపులోని తియ్యదనాన్ని ఆస్వాదించలేని వారు బిడ్డలే కాలేరు. నడకనే కాదు నడతను నేర్పిస్తుంది. నాగరికత అలవర్చుతుంది. మారాం చేసే బిడ్డను జోలపాటతో నిద్రపుచ్చుతుంది. ఆకలితో వెక్కివెక్కి ఏడ్చే బిడ్డ కడుపు నింపి సేద తీరుస్తుంది. కుటుంబమనే రథానికి అమ్మే సారథి. బిడ్డ చెంతనే ఉన్నా, దూర తీరాల్లో కొలువుతీరిన అమ్మ మనస్సేప్పు డు వారి చుట్టే తిరుగుతుంది. కడుపు తీపి చంపుకోలేని అశక్తురాలు అమ్మ. అంతటి త్యాగమయి గురించి ఏటా గుర్తు చేసుకునే రోజే మాతృ దినోత్సవం. ఒకప్పుడు వంటగదికే అమ్మ పరిమితం.

ఇప్పుడు ఎన్నో బాధ్యతల సమ్మిలితం ఆమె జీవితం. ఆరోగ్యం సహకరించకున్న బాధ్యతల నుంచి తప్పించుకోలేని ఏకైక వ్యక్తి అమ్మ. విశ్రాంతి ఆమె ఊహకు అందని మాట. తల్లి త్యాగాన్ని నిర్లక్షం చేస్తుంది ఈ తరం. బాధ్యతలను విస్మరిస్తుంది యువతరం. అన్ని బందాలకు వారధి కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థకు సారధిగా తన పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచాలని కోరుకుంటుంది. తప్పు చేసిన పిల్లలను మొదట దండించిన సన్మార్గంలో నడిపిస్తూ వారధిగా, సారధిగా కష్టపడుతుం ది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన ధైర్యంగా ముందుకు వెళ్తు పిల్లల ఎదుగుదలకు కృషి చేస్తుంది. అక్కున చేర్చుకొని తల నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకునే అమ్మ స్పర్శ ఎంతో గొప్పది.

అంతటి అనుభూతిని భావ వ్యక్తికరణ చేయడానికి పదాలు దొరుకునా? అమ్మ గురించి రాయడానికి కలం కదులునా? అమ్మ యావత్ విశ్వమండలమంతా వెలిగే అఖండ ప్రేమజ్యోతి అని తెలుపుటకు స్థాయి సరిపోవునా? వీచే చల్లని గాలిలో అమ్మ పలకరింపు పున్నమి నాటి చంద్రుని కాంతితో అమ్మ దీవెనల వెలుగులు వర్ణించడానికి భాష సరిపోవునా? వేలు పట్టుకొని నడిపించే అమ్మ వార్ధక్యంలో ఆసరాకోసం చేయి చాపితే దూరంగా నెట్టెస్తున్నారు కొందరూ తనయులు. వృద్ధాశ్రమాలే నీడనిచ్చే కేం ద్రాలవుతున్నాయి. ప్రేగు తెంచుకొని పుట్టిన కొడుకు ప్రయోజకుడయ్యే వరకు నీడలా కాపాడే తల్లి వార్ధక్యంలో తానే నీడ కోల్పోతుంది. బతికుండగానే శ్మశాన వాటికలకు చేర్చే పుత్ర రత్నాలు అక్కడక్కడ తారస పడుతుండడం చింతించాల్సిన విషయం. ఈరోజు అమ్మ… రేపు మనం అన్న విషయాన్ని విస్మరిస్తున్న వారిలో కొందరిలోనైనా పశ్చాత్తాపం కలిగించినట్లయితే మాతృ దినోత్సవం ప్రాధాన్యం పొందినట్లే .

Mother is the image of Brahma god on earth

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమకు పెన్నిధి.. అనుబంధాల వారధి అమ్మ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: