ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లి చేయరేమో అనే అనుమానంతోనే ఘటన   మనతెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ఇరువురిది ఒకటే కులం. ప్రేమించుకున్నా రు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇరువురు ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలెపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరా లు ఇలా ఉన్నాయి.. జడ్చర్ల మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కుమార్ (21) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. పోలెపల్లిలోని మేనమామ […] The post ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పెళ్లి చేయరేమో అనే అనుమానంతోనే ఘటన

 

మనతెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ఇరువురిది ఒకటే కులం. ప్రేమించుకున్నా రు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇరువురు ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలెపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరా లు ఇలా ఉన్నాయి.. జడ్చర్ల మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కుమార్ (21) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. పోలెపల్లిలోని మేనమామ దగ్గర నివాసం ఉంటున్నాడు. జడ్చర్లలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన నందిని(19)తో పరిచ యం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల నందినికి వివాహం నిశ్చయమైంది. అయితే నందినికి ఇష్టంలేని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడలేదు. ఇదిలా ఉండగా కుమార్, నందిని ఇరువురు ప్రేమించుకున్న విషయం కూడా ఇరు కుటుంబాలకు తెలియదు. అయితే నందిని పెళ్లి నిశ్చయం కావడంతో తమ పెళ్లి కాదేమో అని నిర్ణయించుకున్న ఇరువురు బుధవారం రాత్రి పోలెపల్లికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Lovers Commit Suicide in Jadcherla in Mahaboobnagar

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: