మండే ఎండలతో జర జాగ్రత్త

హుజూరాబాద్ రూరల్ (కరీంనగర్) : గత వారం రోజుల నుంచి ఎండల తీవ్రత విపరితంగా పెరిగింది. 45డిగ్రీల ఉష్ణోగ్రత్ తో బయటికి వెళ్దామంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రతతో ఉద్యోగులు, దిన సరి కూలీలు రోజు వారి వ్యాపారులపై తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ కూడా ఈ వారం రోజులు తీవ్ర ఎండలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఎండలు అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉన్నందున వైద్యులు తగిన సూచనలు ఇస్తున్నారు. దీంతో ఎండల […] The post మండే ఎండలతో జర జాగ్రత్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హుజూరాబాద్ రూరల్ (కరీంనగర్) : గత వారం రోజుల నుంచి ఎండల తీవ్రత విపరితంగా పెరిగింది. 45డిగ్రీల ఉష్ణోగ్రత్ తో బయటికి వెళ్దామంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రతతో ఉద్యోగులు, దిన సరి కూలీలు రోజు వారి వ్యాపారులపై తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ కూడా ఈ వారం రోజులు తీవ్ర ఎండలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఎండలు అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉన్నందున వైద్యులు తగిన సూచనలు ఇస్తున్నారు. దీంతో ఎండల తీవ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వైద్యులు తగిన సూచనలతో కూడిన సలహాలు ఇస్తున్నారు. ఎక్కువగా తిరిగినప్పుడు మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4డిగ్రీల ఫారన్ హిట్ ఉంటుంది. మనిషి అంతకన్నా ఉష్ణోగ్రత ఉంటే అస్వస్థకు గురవుతాడు. మండుటేండల్లో ఎక్కువగా తిరిగితే శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. దీంతో శరీరంలోని ఉష్ణోగ్రత అధికంగా పెరిగి వడదెబ్బ భారీన పడుతారు. దీంతో శ్వాస ఇబ్బందులు, కండ్లు తిరగడం ఒక్కోక్క సారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దీనినే వడదెబ్బ అంటారు.
– వడదెబ్బ భారీన పడిన వ్యక్తిని చల్లని ప్రదేశంలో ఆరుబయట ఉంచాలి. గాలి బాగా వచ్చే విధంగా చూడాలి. దుస్తులు పలుచగా ఉండే విధంగా చూడాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు చల్లని నీటితో తడిపిన గుడ్డతో రుద్దాలి. వీరికి ఓఆర్‌ఎస్ ద్రావణంతో పాటు కొబ్బరి నీళ్లు తాగించడం మంచిది. రోగికి ప్రథమ చికిత్స చేసి వైద్యులను సంప్రదించడం మంచిది.

– ఎండ తీవ్రత… తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరుబయట పనిచేసే వారు, ఉద్యోగస్తులు నేరుగా ఎలాంటి రక్షణ లేకుండా బయట తిరుగద్దని, తరుచూ సరైన ద్రావణాలు తాగుతూ ఉండాలని, బయటకి వెళ్లేటప్పుడు మంచినీరు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
* ఎండలో వెళ్లేటప్పుడు తలపై టోపీగాని, తలపాగ ధరించడం మంచిది.
* ఎండలో కాటన్ దుస్తులు, వదులుగా పలుచగా ఉండే దుస్తులు ధరించడం మంచింది.
* కాఫీలు, టీ లతో పాటు ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
* ఎండ వేడిలో ఎక్కువ సేపు పని చేయకూడదు.
* బయటకి వెళ్లేటప్పుడు గొడుగుగాని, చేతి రుమాలు గాని ఉంచుకోవడం
మంచిది.
* వడదెబ్బకు గురైనట్లు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.
* వీలైనంతవరకు ఉదయం 10గంటల లోపు పనులు పూర్తి చేసుకోవడం మంచిది.
పై జాగ్రత్తలు పాటిస్తే ఎండ వేడికి కొంత ఉపశమనం కలుగవచ్చు.

Precautions In Summer To People

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మండే ఎండలతో జర జాగ్రత్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: