గుమ్మడి పోషకాల గుమ్మి

సాంబార్, రసం లాంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే గుమ్మడి అనుకుంటాం. కానీ, గుమ్మడి కాయలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అనేకం. మిగతా పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో బీటా-కెరోటిన్ చాలా ఎక్కువ. అంతగా చెప్పుకునే క్యారెట్‌లో కన్నా ఇది గుమ్మడిలోనే ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా కూడా జీర్ణమయ్యే పదార్థం కూడా. దీన్ని గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు ఇస్తే హాయిగా తినేసి ఆరోగ్యంగా […] The post గుమ్మడి పోషకాల గుమ్మి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సాంబార్, రసం లాంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే గుమ్మడి అనుకుంటాం. కానీ, గుమ్మడి కాయలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అనేకం. మిగతా పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో బీటా-కెరోటిన్ చాలా ఎక్కువ. అంతగా చెప్పుకునే క్యారెట్‌లో కన్నా ఇది గుమ్మడిలోనే ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా కూడా జీర్ణమయ్యే పదార్థం కూడా. దీన్ని గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు ఇస్తే హాయిగా తినేసి ఆరోగ్యంగా ఉంటారు. దీని విశేషాల గురించి తెలిసి, కొంతకాలంగా విదేశీయులు కూడా భోజనంలో వాడేస్తున్నారు.

ప్రత్యేకించి సూప్స్‌లో దీని వాడకం బాగా ఎక్కువయ్యింది. కూరగానో, సాంబార్‌గానో వాడే గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. చర్మానికీ, శిరోజాలకూ ఇవెంతో ఉపకరిస్తాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఇట్టే తొలగిపోతుంది. విటమిన్ -సి కూడా ఎక్కువగా ఉండే గుమ్మడి వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. పైగా స్త్రీ పురుషులు ఇరువురిలోనూ లైంగిక వ్యవస్థను ఆరోగ్యపరుస్తుంది. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండడం వల్ల గుమ్మడినొక సమస్త పోషకాల నిధిగా న్యూట్రిషియన్లు చెబుతుంటారు.

 Health Benefits of Pumpkin

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గుమ్మడి పోషకాల గుమ్మి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.