ఛాయా సోమేశ్వరాలయం

ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురున్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగొల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయభానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసి ద్ధి పొందింది. ఈ ఆలయం […] The post ఛాయా సోమేశ్వరాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురున్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగొల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయభానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసి ద్ధి పొందింది. ఈ ఆలయం పడమర దిక్కున ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంత సేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు.

సాధారణంగా ‘నీ డ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అం టారు. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

పురాణ కథనం: ఆలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉండటం, గర్భగుడిలోని శివలింగంపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతరం నీడ పడడం… ఛాయాసోమేశ్వరాలయం ప్రత్యేకతలు. సూర్యభగవానుని భార్య, శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం శివలింగంపై నీడపడేలా ఇక్కడ ఆలయం నిర్మించారని పెద్దలు చెబుతారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ నాటి సమాజానికి సైతం ఆ ఛాయ ఎక్కడి నుంచి పడుతోందన్నది సవాలుగానే ఉంది. ఆనాటి వాస్తుశిల్పుల నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలుస్తోంది ఛాయాసోమేశ్వరాలయం.

నల్గొండ జిల్లా పానగల్‌లో ఉన్న ఛాయాసోమేశ్వరాలయాన్ని 12వ శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించారు. త్రికూట ఆలయంగా కూడా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలో శిల్ప సంపద ఎంతో అందంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా దక్షిణం వైపు ము ఖ ద్వారంతో ఎనిమిది ఉప ఆలయాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఛాయాసోమేశ్వరాలయాన్ని దర్శించుకుంటే శత్రు నివారణ, శనిదోష నివారణ జరుగుతాయనీ, నరదిష్టి పోతుందని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయాలన్నిటినీ పూర్తిగా రాతితో నిర్మించారు. సోమేశ్వరాలయం తెల్లరాయితో, ప చ్చల సోమేశ్వరాలయం పచ్చరాయితో నిర్మించా రు. ఆలయం గర్భగుడిలో శివలింగం, తూర్పు దిక్కున గల ఆలయంలో సూర్యభగవానుడు, ఉత్త రం వైపునున్న ఆలయంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నారు. ఆలయంలోని గర్భగుడిలో ఒంటరిగా కూర్చుని స్వామిని ధ్యానిస్తూ ఉంటే ఓంకార నా దం విన్పిస్తుందంటారు. ఓంకారనాదం ప్రతిధ్వనించేలా ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం జరిపారని భ క్తుల నమ్మకం. ఛాయాసోమేశ్వరాలయాన్ని శివ పంచాయతనం ప్రకారం నిర్మించారని పండితులు చెబుతుంటారు.

ఆలయం ప్రాంగణంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. కాలభైరవుడు, క్షేత్రపాలకు డు, అభయాంజనేయస్వామి, రాజరాజేశ్వరి, వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు. నాటి శిల్పులు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయంలోని అతి పెద్ద నందీశ్వరుడు, శనిదేవుడు, త్రికూట ఆలయం శిఖరంపైన ఉన్న రాతి శిఖరాలు కాలక్రమంలో ధ్వంసమయ్యాయి. కానీ కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం వల్ల నల్గొండలోని పానగల్ ఛాయాసోమేశ్వరాలయానికి పూర్వవైభవం వచ్చింది.

Chaya Someswaralayam Panagal Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఛాయా సోమేశ్వరాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.