జూన్ కల్లా మిషన్ కాకతీయ పనులు

రాష్ట్రంలో 30వేల చెరువులకు మరమ్మతులు,  రూ. 16వేల కోట్లు మంజూరు : స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోటగిరి: మిషన్ కాకతీయలో భాగంగా మంజూరైన చెరువు మరమ్మతు పనులు జూన్ మాసంకల్లా వేగవంతంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. కోటగిరి మండలంలోని హాంగర్గ ఫారం, కా రేగాం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి డబుల్‌బెడ్ రూం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కారేగాంలో […] The post జూన్ కల్లా మిషన్ కాకతీయ పనులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాష్ట్రంలో 30వేల చెరువులకు మరమ్మతులు,  రూ. 16వేల కోట్లు మంజూరు : స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కోటగిరి: మిషన్ కాకతీయలో భాగంగా మంజూరైన చెరువు మరమ్మతు పనులు జూన్ మాసంకల్లా వేగవంతంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. కోటగిరి మండలంలోని హాంగర్గ ఫారం, కా రేగాం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి డబుల్‌బెడ్ రూం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కారేగాంలో నిర్మిస్తున్న 40 డబుల్‌బెడ్‌రూంలు పూర్తి దశకు రావడంతో ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన లబ్ధ్దిదారులకు కేటాయించాలన్నారు.

మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ నాగేశ్వర్‌రావుకు ఆదేశించారు. చెరువుల మరమ్మత్తు పనులలో అధికారులు నిర్లక్షం చేస్తున్నారని ఇరిగేషన్ మైనర్ ఏఈ జీవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చెరువుల మ ర మ్మత్తులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం లక్షల రూ.లు వెచ్చించి చెరువుల పునరుద్దరణ పనులు చేపడుతుంటే అధికారుల నిర్లక్షంతో మిషన్ కాకతీయ నీరుగారిపోతుందన్నారు. రైతుల సహకారంతో అధికారులు పనులు జరిపించాలే తప్ప కాంట్రాక్టర్లు ఇచ్చే కాసులకు కక్కర్తిపడొద్దన్నారు. కారేగాం చెరువులో కాంట్రాక్టర్ అసలు మట్టిపూడికతీత పనులు చేపట్టలేదని రైతులు స్పీకర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన ఆ చెరువుకు సంబంధించి మట్టి ఎంత తీయాలని అడగగా ఏఈ సమాధానం చె ప్ప క పో వడంతో తీవ్రంగా మండిపడ్డారు.

కాంట్రాక్టర్లతో పనులు చేయించలేని అధికారులు చేతకాకపోతే ఉద్యోగం మానుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకమొదలే చెరువుల మరమ్మత్తు పనులు పూర్తి చేసుకొని చెరువుల కింది కాలువలు, గోదావరి నుండి గొలుసుకట్టు చెరువులకు వచ్చే కాలువలు తీయించుకోవాలన్నారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌తో పాటు పిల్ల కాలువల మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 46వేల చెరువులకు ప్రతిపాదన పంపితే మిషన్ కాకతీయ ఫేస్ -1, ఫేస్-2, ఫేస్-3లో భాగంగా 30వేల చెరువుల పునరుద్దరణ పనులకు గాను సుమారు 16వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనుల్లో అధికారులు రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

భూగర్బజలాల పెరుగుదలకు మంజీరపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం

శాశ్వతంగా మంజీర పరివాహక ప్రాంతాల శివారులో భూగర్బజలాల పెరుగుదలకు మంజీరనదిపై 4 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, కొడిచర్ల, సుంకిని గ్రామాల వద్ద మంజీర నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 9 మాసాల్లో పనులు పూర్తి అవుతాయన్నారు. ఆయన వెంట హాంగర్గ పారం సర్పంచ్ ఎజాజ్‌ఖాన్, కొల్దూరు సర్పంచ్ సంపత్, కారేగాం మాజీ సర్పంచ్ సాంబశివరావు, నాయకులు నీరడి గంగాధర్, శివరాజ్‌పటేల్, లక్ష్మణ్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.

pocharam srinivas checks mission kakatiya works

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జూన్ కల్లా మిషన్ కాకతీయ పనులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: