కరీంనగర్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుతాం

ప్లాస్టిక్ కవర్ల వాడకం ద్వారా వాతావరణం, నేల కలుషితం ప్రత్యేక నిఘా బృందాల ద్వారా వ్యాపార సంస్థల పై తనిఖీలు ప్లాస్టిక్ తో పట్టుబడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ప్లాస్టిక్ నిషేధానికి నగర ప్రజలు కృషి చేయాలి నగరపాలక కమీషనర్ భద్రయ్య   మన తెలంగాణ/కరీంనగర్ టౌన్: కరీంనగర్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుతామని నగరపాలక కమీషనర్ భద్రయ్య అన్నారు. ప్లాస్టిక్ నిషేదం పై నగరపాలక సంస్థ సమరం చేపట్టిందని, ప్రత్యేక నిఘా […] The post కరీంనగర్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్లాస్టిక్ కవర్ల వాడకం ద్వారా వాతావరణం, నేల కలుషితం
ప్రత్యేక నిఘా బృందాల ద్వారా వ్యాపార సంస్థల పై తనిఖీలు
ప్లాస్టిక్ తో పట్టుబడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
ప్లాస్టిక్ నిషేధానికి నగర ప్రజలు కృషి చేయాలి
నగరపాలక కమీషనర్ భద్రయ్య

 

మన తెలంగాణ/కరీంనగర్ టౌన్: కరీంనగర్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుతామని నగరపాలక కమీషనర్ భద్రయ్య అన్నారు. ప్లాస్టిక్ నిషేదం పై నగరపాలక సంస్థ సమరం చేపట్టిందని, ప్రత్యేక నిఘా బృందాల ద్వారా వ్యాపార సంస్థల పై తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కమీషనర్ చాంబర్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లడుతూ…. ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ చట్టం ప్రకారం భారీ జరిమాన విధిస్తామని సూచించారు. మూడోసారి ప్లాస్టిక్ తో పట్టుబడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నేటి నుంచి ప్లాస్టిక్ పై ఎన్ ఫోర్స్ మెంట్ బృందం ద్వారా పెద్ద సంఖ్యలో తనిఖీలు చేపడతామని తెలిపారు. రెండు సార్లకు మించి ప్లాస్టిక్ వాడుతూ పట్టు బడ్డ షాపుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

నగరంలో ప్లాస్టిక్ వాడకం చాలా పెరిగిందని, ప్లాస్టిక్ కవర్ల వాడకం ద్వారా వాతావరణం, నేల కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ కారణంగా వేసవి కాలం అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, దానిద్వారా వచ్చే విష పూరిత పొగ వల్ల నగర ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతుందని తెలియజేశారు. డంపింగ్ యార్డుకు ప్లాస్టిక్ వెల్లకుండ నియంత్రణ చర్యలు చేపట్టడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. నగరంలోని డివిజన్లలో ఏర్పాటు చేసిన డిఆర్‌సిసి లతో ప్లాస్టిక్ వేరు చేసి చెత్తను డంపింగ్ యార్డుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధానికి నగర ప్రజలు కూడా కృషి చేయాలని ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా గన్ని బ్యాగులు వినియోగించాలని సూచించారు.

చెత్తను నగరపాలక సంస్థ వాహనాలకు, రిక్షాలకు చెత్తను అందించే ముందు ప్లాస్టిక్ ను వేరు చేసి మాత్రమే ఇవ్వాలని నగర ప్రజలకు కమీషనర్ తెలిపారు. ప్లాస్టిక్ పై నగర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. వేసవి కాలం సందర్భంగా నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరాలో నీటి చౌర్యం పై ప్రత్యేక నిఘా చేపట్టామన్నారు. నగర ప్రజలు మంచి నీటి సరఫరా సమయంలో నల్లాలకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడితే మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి నల్లా కనెక్షన్ ను తొలగించడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. వేసవి కాలంలో మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని కమీషనర్ తెలిపారు. నల్లా కనెక్షన్ లైన్ మెన్లు, ఇతర విభాగం అధికారులతో నీటి చౌర్యం పై తనిఖీలు చేస్తామని తెలిపారు. మోటార్లు బిగించినట్లు అభికారుల దృష్టికి వస్తే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రయ్య పేర్కొన్నారు.

 

Karimnagar will be Changed Plastic Free City

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కరీంనగర్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: