స్వయం ఉపాధి శిక్షణపై అవగాహన సదస్సు

 సిరికొండ (ఆదిలాబాద్ ) :  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని  నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బిఐ శిక్షణ సంస్థ ప్యాకల్టీ మల్లయ్య తెలిపారు. సోమవారం సిరికొండ మండలం ముత్యపేట గ్రామంలో యువతి యువకులకు అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడారు. స్వయం ఉపాధి నిరోద్యోగులకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం […] The post స్వయం ఉపాధి శిక్షణపై అవగాహన సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 సిరికొండ (ఆదిలాబాద్ ) :  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని  నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బిఐ శిక్షణ సంస్థ ప్యాకల్టీ మల్లయ్య తెలిపారు. సోమవారం సిరికొండ మండలం ముత్యపేట గ్రామంలో యువతి యువకులకు అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడారు. స్వయం ఉపాధి నిరోద్యోగులకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన చెప్పారు.  ఆసక్తిగల యువతి యువకులు కేబి కాంప్లెక్స్ ఉట్నూర్ ఆఫిస్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫోటోగ్రఫి, హోమ్‌వైరింగ్, సెల్‌పోన్ రీపేరింగ్, ప్లంబింగ్, ఎసి రిపేరింగ్ తదితర అంశాల్లో 30 రోజులు శిక్షణ ఉటుందని, శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కలిపిస్తామని మల్లయ్య తెలిపారు.  10 పాస్ అయి 18 నుంచి 40 లోపు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు  చేసుకునేందుకు ఈ నెల 15ను లోపు 8096093085, 9949412159 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ దేవురావ్, సుదర్శన్, మారుతి, భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.

Awareness Conference on Self Employment Training

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్వయం ఉపాధి శిక్షణపై అవగాహన సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.