టిఆర్‌ఎస్‌తోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం : గంగుల

కరీంనగర్ రూరల్‌ :  టిఆర్‌ఎస్‌తోనే గ్రామీణాభివృద్ధి  సాధ్యమని కరీంనగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ కు ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు. పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ జడ్పీటిసి,ఎంపిటిసి ఆభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి, చామన పల్లి, ఫకీర్ పేట,ఎలబోతారం ,మొగ్దుంపూర్ ,మందుల పల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలితా -శ్రీనివాస్‌తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. […] The post టిఆర్‌ఎస్‌తోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం : గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ రూరల్‌ :  టిఆర్‌ఎస్‌తోనే గ్రామీణాభివృద్ధి  సాధ్యమని కరీంనగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ కు ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు. పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ జడ్పీటిసి,ఎంపిటిసి ఆభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి, చామన పల్లి, ఫకీర్ పేట,ఎలబోతారం ,మొగ్దుంపూర్ ,మందుల పల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలితా -శ్రీనివాస్‌తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తు వేయాలని,కరీంగనర్ రూరల్ మండల జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలిత -శ్రీనివాస్‌ను టిఆర్‌ఎస్ ఎంపిటిసి ఆభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. గ్రామాల్లో గతంలో లేని విధంగా రహదారుల నిర్మాణం చేపట్టామని, టిఆర్‌ఎస్‌తోనే గ్రామాలాభివృద్ది జరుగుతుందని, టిఆర్‌ఎస్ ఆభ్యర్థులకే ఓటు వేయాలని,కాంగ్రెస్,బిజెపి ఓటు వేస్తే గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. శాసన సభ నుంచి పరిషత్ పరకు అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్ ప్రజాప్రతిేనిధులు ఉంటేనే అభివృద్ది వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు.గత ప్రభుత్వాలు నాణ్యమైన కరెంట్‌ను ఇవ్వలేదని,కారెంట్ లేక మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పాడ్డారని ,తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి మారిపోయిందని, రైతు బంధు,రైతు భీమా,24 గంటల కరెంట్,రైతు రుణా మాఫీ తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతుల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో,వేగంగా జరుగుతున్న అభివృద్ది తెలంగాణ ప్రతిపక్షాలకు పతనం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. దేశంలో మంచిపాలనను అందిస్తున్న కెసిఆర్‌ మాత్రమేనని, కెసిఆర్ పాలనకు తిరుగులేదని ఆయన తేల్చి చెప్పారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి టిఆర్‌ఎస్ ఎంపిటిసి ,జడ్పీటిసి అభ్యర్థులను ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి వాసాల రమేష్,గ్రామ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్,నాయకులు కాసెట్టి శ్రీనివాస్,సంపత్ రావు,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కట్ల సంజీవ రెడ్డి ,ఎంపిటిసి ఆభ్యర్థులు తిప్పర్తి లక్ష్మయ్య,చల్ల రామక్క,దేవనపల్లి పుష్ప, సూర్యశేఖర్ ,బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

MLA Gangula Kamalakar Election Campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్‌తోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం : గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: