స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : కవిత

నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. నవిపేట్ మండలం పోతoగల్ గ్రామంలో కవిత తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.  అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ వందకు వంద శాతం విజయం సాధిస్తుందని ఆమె పేర్కన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని ఆమె […] The post స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. నవిపేట్ మండలం పోతoగల్ గ్రామంలో కవిత తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.  అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ వందకు వంద శాతం విజయం సాధిస్తుందని ఆమె పేర్కన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని ఆమె చెప్పారు. టిఆర్ఎస్ కు చెందిన జడ్ పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆమె సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని ఆమె జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో తెలంగాణ సత్తాను చాటనున్నారని ఆమె పేర్కొన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ఈ క్రమంలో ఢిల్లీలో కెసిఆర్ చక్రం తిప్పుతారని ఆమె స్పష్టం చేశారు.
MP Kavitha Comments on Local Bodies Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: