ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి…

   ఆదిలాబాద్ : ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ సూచించారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్ మం డల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఆదిలాబాద్ గ్రామీణం, మావల మండలాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది సామాగ్రిని తీసుకున్నారు. సామాగ్రిని సరి చూసుకున్న అనంతరం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. ఈ కేంద్రాన్ని జిల్లా […] The post ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 ఆదిలాబాద్ : ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ సూచించారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్ మం డల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఆదిలాబాద్ గ్రామీణం, మావల మండలాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది సామాగ్రిని తీసుకున్నారు. సామాగ్రిని సరి చూసుకున్న అనంతరం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు.

ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది కేటాయింపు తదితర అంశాలను ఎంపిడిఒ రవీందర్ వివరించారు. కలెక్టర్ వెంట డిఆర్‌ఒ నటరాజన్ తదితరులున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ… ఎన్నికలను సమర్థ్ధవంతంగా నిర్వహిస్తామనే కృతనిశ్చయంతో విధులను నిర్వహించాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చల్లటి నీటితో పాటు ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించడం జరుగుతుందన్నారు.

వేడి తీవ్రత నుంచి ఉపశమనం పొందడంపై దృష్టి సారించాలని సూచించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలించి ఓటు వేసేందుకు అనుమతించాలని, ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్క పెట్టాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేసవి సెలవుల్లో విధులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తామని వెల్లడించారు.

Give priority to health

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: