ఎన్నికలేవైనా.. గెలుపు టిఆర్‌ఎస్‌దే…మంత్రి వేముల

  కమ్మర్‌పల్లి : రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ఫలితాలు టిఆర్‌ఎస్ వైపే ఉంటాయని రాష్ట్ర రోడ్లు భవనలు, గృహ నిర్మాణ, రవాణ శాఖ, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లిలో గురడి రెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం జడ్పీటీసీ, ఎంపిటిసి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్మ అతిథిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి హజరై మాట్లాడారు. ఎంపిటిసి, జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని […] The post ఎన్నికలేవైనా.. గెలుపు టిఆర్‌ఎస్‌దే… మంత్రి వేముల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కమ్మర్‌పల్లి : రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ఫలితాలు టిఆర్‌ఎస్ వైపే ఉంటాయని రాష్ట్ర రోడ్లు భవనలు, గృహ నిర్మాణ, రవాణ శాఖ, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లిలో గురడి రెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం జడ్పీటీసీ, ఎంపిటిసి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్మ అతిథిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి హజరై మాట్లాడారు. ఎంపిటిసి, జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతుందని, మాట తప్పని మహానీయుడు మన కెసిఆర్ అని అన్నారు. 4నెలల్లో కాళేశ్వరం జళాలతో ఎస్సారెఎస్పీ ప్రాజెక్టు నిపుతమని చెప్పారు.

మరో సారి రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేయబొతున్నమని, అభివృద్ధి చేసే పార్టీకి అండగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నాయకులు, కార్యకర్తలను, అభిమానులను కోరారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కాభోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే శని పట్టుకుంటుందని, టీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే కాళేశ్వరం నీరు తెచ్చుకుంటామన్నారు. పార్టీకి వ్యతిరేకం చేస్తే స్వంత తమ్మునైన క్షెమించేది లేదన్నరు. టికెట్ రాని వారు రెబల్‌గా గెలిచినా మల్లి పార్లీలోకి తీసుకునేది లేదని కారకండిగా చెప్పారు. పార్టీ టికెట్ రానివారు నిరాశ చెందవద్దని మునుముందు వారికి మంచి అవకశాలు పార్టీలో దక్కుతుందన్నారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగలన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
నిరుద్యోగులకు రూ. 3016
మాజి స్పికర్ కేఆర్ సురేష్ రెడ్డి…
నిరుద్యోగులకు రూ. 3016 అందిచబొతున్నమని, వరుస ఎన్నికలతో అభివృద్ధి పనులు సాగడం లేదని, మరో నెల రోజుల తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని మాజి స్పికర్ కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనకు నాలుగేండ్ల టిఆర్‌ఎస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధిని తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే కెసిఆర్ ఆశయం అని, ఆయన ఆదర్శ పాలనతో దేశంలోనే తెలంగాణ గుర్తింపు తేవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు బద్దం చిన్నరెడ్డి, తెరాస బిసిసెల్ రాష్ట్ర కార్యదర్శి బాస్కర్ యాదవ్, రేగుంట దేవేందర్, వివిద గ్రామాలకు చెందిన సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపిటిసి అభ్యర్థులు, రెండు వేల మంది నాయకులు, కార్యకర్తలు హజరైయారు.

 

TRS success in every election

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్నికలేవైనా.. గెలుపు టిఆర్‌ఎస్‌దే… మంత్రి వేముల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: