మహా గర్జనను విజయవంతం చేయండి: మంద కృష్ణ మాదిగ

ఖమ్మం : హైదరాబాద్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన చోటే తిరిగి తిరిగి ప్రతిష్టింపచేయాలని కోరుతూ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 8న జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని కొరారు. ఆదివారం ఖమ్మంలో బిసి-జెఎసి కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బిసి-జెఎసి జిల్లా కన్వీనర్ పాల్వంచ రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని కులమతాలకు అతీతంగా రాజ్యాంగం రూపొందించి సమాజంలో వివక్షతకు గురైన బడుడు బలహీన వర్గాలవారికి రిజర్వేషన్ […] The post మహా గర్జనను విజయవంతం చేయండి: మంద కృష్ణ మాదిగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : హైదరాబాద్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన చోటే తిరిగి తిరిగి ప్రతిష్టింపచేయాలని కోరుతూ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 8న జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని కొరారు. ఆదివారం ఖమ్మంలో బిసి-జెఎసి కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బిసి-జెఎసి జిల్లా కన్వీనర్ పాల్వంచ రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని కులమతాలకు అతీతంగా రాజ్యాంగం రూపొందించి సమాజంలో వివక్షతకు గురైన బడుడు బలహీన వర్గాలవారికి రిజర్వేషన్ కల్పించిన మహానీయుడని కొనియాడారు. గాంధీ మహాత్ముడి మాదిరిగానే అంబేద్కర్ అందరివాడని కొంతమంది స్వార్దపరులు ఆయన్ను కొందరివాడిగానే చూపించటం అన్యాయమన్నారు. అంబేద్కర్, పూలే భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఏ భావజాలానికైనా బిసి-జెఎసి సంపూర్ణ మధ్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మహాగర్జన సభను విజయవంతం చేసేందుకు కులమతాలకు అతీతంగా అంబేద్కర్‌వాదులంతా తరలిరావాలని కోరారు. స్తానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్తానాల్లో బిసిలు పోటీచేసే చోట బిసిలకు తమ సంఘం మద్దతు నిస్తుందని చెప్పారు. బూడిదంపాడు ఎంపిటిసి స్థానానికి కూడా బిసిజెఎసి మద్దతు తెలిపిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లెబోయిన చంద్రయ్య, గుండ్లపల్లి శ్రీనివాస్, చెవుల వెంకన్నయాదవ్, నేలల శ్రీనివాసరావు, దుర్గయ్యతోపాటు అనేక మంది బిసి-జెఎసి నాయకులు పాల్గొన్నారు.

Leaders introduced Walposter at the BC JAC office


Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహా గర్జనను విజయవంతం చేయండి: మంద కృష్ణ మాదిగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: