కెసిఆర్ పాలనకు తిరుగులేదు : గంగుల

కరీంనగర్ రూరల్‌ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది,సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాల పతనం ప్రారంభమైందని, పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించి ముఖ్య మంత్రి కెసిఆర్ పాలనను బలోపేతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్ పూర్ ,చేగుర్తి,నల్లగుంట పల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలితా -శ్రీనివాస్‌తో కలిసి ,కొత్తపల్లి మండలంలోని ఎలగందుల,కమాన్ పూర్,బద్దిపెల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పిట్టల కరుణ-రవిందర్‌తో […] The post కెసిఆర్ పాలనకు తిరుగులేదు : గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ రూరల్‌ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది,సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాల పతనం ప్రారంభమైందని, పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించి ముఖ్య మంత్రి కెసిఆర్ పాలనను బలోపేతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్ పూర్ ,చేగుర్తి,నల్లగుంట పల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలితా -శ్రీనివాస్‌తో కలిసి ,కొత్తపల్లి మండలంలోని ఎలగందుల,కమాన్ పూర్,బద్దిపెల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పిట్టల కరుణ-రవిందర్‌తో కలిసి పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తు వేయాలని కోరారు. కరీంగనర్ రూరల్ మండల జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలిత -శ్రీనివాస్,కొత్తపల్లి మండల టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పిట్టల కరుణ-రవిందర్ కు ఓటు వేసి టిఆర్‌ఎస్ గెలిపించాలని ఓటర్లను ఆభ్యర్థించారు. కరీంనగర్ మండలం ,కొత్తపల్లి మండలం జడ్పీటిసి,ఎంపిపిలను గెలిపించి కెసిఆర్‌కు కానుక ఇవ్వాలని,అన్ని ఎంపిటిసిలు,జడ్పీటిసిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామాల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. గ్రామాల్లో గతంలో లేని విధంగా రహదారుల నిర్మాణం చేసిందని ,టిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని,గ్రామాల్లో టిఆర్‌ఎస్ ఆభ్యర్థులకే ఓటు వేయాలని,కాంగ్రెస్,బిజెపి ఓటు వేస్తే గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని,శాసన సభ నుంచి పరిషత్ పరకు అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్ ఉంటేనే అభివృద్ది వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు నాణ్యమైన కరెంట్‌ను ఇవ్వలేదని,కారెంట్ లేక మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయాన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి మారిపోందని,రైతు బంధు,రైతు భీమా,24 గంటల కరెంట్,రైతు రుణా మాఫి, ఆనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతుల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. దేశంలో మంచిపాలనను అందిస్తున్న ఘనత కెసిఆర్‌దే అని,కెసిఆర్ పాలనకు తిరుగులేదని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి టిఆర్‌ఎస్ ఎంపిటిసి ఆభ్యర్థులను,జడ్పీటిసి ఆభ్యర్థులను ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్,ఎంపిపి వాసాల రమేష్,గ్రామ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్,జడ్పీ కో అప్షన్ సభ్యులు జమిలొద్దిన్,నాయకులు కాసెట్టి శ్రీనివాస్,సంపత్ రావు,ఎంపిటిసి ఆభ్యర్థులు వేల్పుల నారాయణ,ఎల్కపల్లి స్వరూప,మంద రమేష్,ఉప్పు మల్లేశం,పిట్టల రవిందర్,సూర్యశేఖర్ ,మంద రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నాయకులు టిఆర్‌ఎస్ చేరిక….కరీంనగర్ మండలంలోని చేగుర్తి గ్రామంలో పరిషత్ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో టిఆర్‌ఎస్ జడ్పీటిసి ఆభ్యర్థి పురమల్ల లలితా -శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం చేశారు. ఈసందర్భంగా పలువురు బిజెపి నాయకులు టిఆర్‌ఎస్‌లోనికి చేరారు. టిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలోవినీత్,సాయి,ఆనంద్,అజేయ్,మనోజ్,నవీన్,చందు,సంతోష్ తో పాటు 100 మంది యువకులు ఉన్నారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కెసిఆర్ పాలనకు తిరుగులేదు : గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: