ముగిసిన తొలి దశ ప్రచారం…

  * ఏడు జడ్‌పిటిసి స్థానాలకు 23మంది అభ్యర్థులు * 94ఎంపిటిసి స్థానాలకు బరిలో 303 మంది బరిలో నిజామాబాద్‌: నిజామాబాద్ జి ల్లాలో జరగనున్న తొలివిడత జడ్‌పిటిసి,ఎంపిటిసి ఎన్నిక ల ప్రచారం శనివారంతో ముగిసింది. శనివారం ప్రచార పర్వానికి తెరపడడంతో ప్రలోభాల పర్వానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపేలక్షంగా ముమ్మరంగా ప్రచారం చేపట్టిన అభ్యర్థుల్లో మరింత టె న్షన్ వాతావరణం నెలకొంది. నిజామాబాద్ డివిజన్‌లో ఏడు జడ్‌పిటిసిలు, 94ఎంపిటిసిలకు ఈ నెల 6న […] The post ముగిసిన తొలి దశ ప్రచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* ఏడు జడ్‌పిటిసి స్థానాలకు
23మంది అభ్యర్థులు
* 94ఎంపిటిసి స్థానాలకు బరిలో
303 మంది బరిలో

నిజామాబాద్‌: నిజామాబాద్ జి ల్లాలో జరగనున్న తొలివిడత జడ్‌పిటిసి,ఎంపిటిసి ఎన్నిక ల ప్రచారం శనివారంతో ముగిసింది. శనివారం ప్రచార పర్వానికి తెరపడడంతో ప్రలోభాల పర్వానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపేలక్షంగా ముమ్మరంగా ప్రచారం చేపట్టిన అభ్యర్థుల్లో మరింత టె న్షన్ వాతావరణం నెలకొంది. నిజామాబాద్ డివిజన్‌లో ఏడు జడ్‌పిటిసిలు, 94ఎంపిటిసిలకు ఈ నెల 6న ఎన్నికలు జరుగనున్నాయి. డివిజన్‌లో తొలి విడతలో జరిగే 8 జడ్‌పిటిసిలలో మాక్లూర్ జడ్‌పిటిసి స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాక్లూర్ జడ్‌పిటిసి టిఆర్‌ఎస్,కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు బరిలో దిగారు. టి ఆర్‌ఎస్ పార్టీ ఇక్కడ చక్రం తిప్పి కాంగ్రెస్,బిజెపి అభ్యర్థులను పోటీ నుంచి త ప్పించారు.దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన దాదన్నగారి విఠల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాక్లూర్ స్థా నం మినహా మిగిలిన ఏడు జడ్‌పిటిసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చే సింది.

నిజామాబాద్, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్,సిరికొండ,నవీపేట జడ్‌పిటిసి స్థా నాలకు ఈ నెల6న సోమవారం ఎన్నికలను నిర్వహించనున్నారు. కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాలో జరుగనున్న తొలివిడత ప్రాదేశిక ఎన్నికలకు ర్యాండమైజేషన్‌ను అధికారు లు పూర్తి చేశారు.మొదటి విడత ఎన్నికలకు స మయం సమీపిస్తుండడంతో ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకుప్రయత్నాలు మొదలుపెట్టా రు. నిజామాబాద్ జడ్‌పిటిసి స్థానానికి ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రె స్,బిజెపి అభ్యర్థులు మాత్రమే పో టీ చేస్తున్నారు. ధర్పల్లి నుంచి కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్ అభ్యర్థులతో ముగిసిన తొలిదశ ప్రచారం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపడుతున్నామన్నారు. రైతులకు పెట్టుబడి ఇస్తున్న రా ష్ట్రం కూడా మన రాష్ట్రమేనని, కేవలం మన ప్రభుత్వానికే ఆ ఘనత దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెంచిన పెన్షన్‌లు వచ్చే నెల 1వ తేదిన అందజేస్తామని, ఎన్నికల కోడ్ ఉండడం వలన ఇవ్వలేకపోయామని ఈ నెలతో అన్ని ఎన్నికలు పూర్తవుతున్నందున వచ్చే నెల 1వ తేదిన పెరిగిన పెన్షన్‌లు ఇస్తామన్నారు.
జడ్‌పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిదుర రమాదేవి లకా్ష్మరెడ్డి, ఎంపిటిసి అభ్యర్థులుగా కమ్మరి అనంత లక్ష్మీ శ్రీనివాస్, నీలమ్మ, నిమ్మ జలజ, పిప్పిరి ఆంజనేయులను కారు గుర్తుకు వేసి అ ధిక మెజార్టీతో గెలిపించాలని, పిప్పిరి ఆంజనేయులు ఎంపిటిసిగా గెలిస్తే ఎంపిపి పదవి వరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, ఎంపిపి లద్దూరి మంగమ్మ ల క్ష్మీపతి యాదవ్, వైస్ ఎంపిపి కృష్ణాజిరావు, సర్పంచ్‌లు చింతల రవితేజగౌడ్, పస్తం యాదమ్మ, కొత్త మమత, నాయకులు గట్టగోని రామాగౌడ్, కమ్మరి శ్రీని, బత్తుల సంజీవ్, మొగుల్ల సాయాగౌడ్, వెంకట్‌రావు, బల్వంత్ రావు, చిదుర శ్రీనివాస్ రెడ్డి, మామిండ్ల అంజయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

First stage campaign Completed

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముగిసిన తొలి దశ ప్రచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: