ముఖ్య నేతలకు పరిషత్ పరీక్ష

  కీలకంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు క్లీన్‌స్వీప్ దిశగా అధికార పార్టీ వ్యూహం పట్టునిలుపుకునేందుకు ప్రతిపక్షాల అడుగులు ప్రచారంలో నిమగ్నమైన నేతలు జడ్పీ పీఠాలపైనే అందరి గురి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుంది. తొలి విడతకు ఒకేఒక్క రోజు గడువు ఉండడంతో తొలి సమరానికి సిద్ధం కానున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నేతలంతా దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపు ఓటముల ప్రభావం […] The post ముఖ్య నేతలకు పరిషత్ పరీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కీలకంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
క్లీన్‌స్వీప్ దిశగా అధికార పార్టీ వ్యూహం
పట్టునిలుపుకునేందుకు ప్రతిపక్షాల అడుగులు
ప్రచారంలో నిమగ్నమైన నేతలు
జడ్పీ పీఠాలపైనే అందరి గురి

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుంది. తొలి విడతకు ఒకేఒక్క రోజు గడువు ఉండడంతో తొలి సమరానికి సిద్ధం కానున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నేతలంతా దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపు ఓటముల ప్రభావం ముఖ్యనేతల పైనే ఉన్నాయి. గులాబీ అభ్యర్థుల గెలుపు బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు తమపై వేసుకొని ఎమ్మెల్యేలను సమన్వయపరు స్తూ ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బిజెపిలు సైతం తమ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ‘ఢీ’కొన్న అభ్యర్థులు కొందరికి తీపి మరికొందరికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను కూడా చవిచూశారు. మూడో పరీక్షగా పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఫలితాలు పెండింగ్‌లో ఉన్న తరు ణంలో వచ్చిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ద్వారా మరో పరీక్షను నాయకులు ఎదుర్కోబోతున్నారు.

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో మంథని మినహా అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో గెలుపుపై టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. ఏదేమైనా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లతో పాటు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌లకు పరీక్షగా మారాయి. తొలి విడత నామినేషన్ల పర్వం నుండి ముఖ్య నేతలందరూ ప్రచార బాట పట్టారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం గులాబీ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన అభివృద్ధి పనులను, అమలుపరిచిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతం తీసుకెళ్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గడపగడపకూ ముమ్మర ప్రచారం ని ర్వహిస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కో సం నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ అనంతరం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలను ఓటర్లు కట్టబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్ పార్టీకే విజయం వరిస్తుందని సర్వేలు చెబుతున్న తరుణంలో వచ్చిన ప్రాదేశిక ఎన్నికలు మాత్రం పరీక్షగా మారాయి. అధికార పార్టీ నుంచి పెద్దపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాల టిఆర్‌ఎస్ ఛైర్మన్ అభ్యర్థులను మాత్రం పెండింగ్‌లో పెట్టారు.

ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి సమీకరణలను బట్టి ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బిజెపి రెండవ స్థానంలో నిలవడంతో ఈసారి ఎలాగైనా తమ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేందుకు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సిఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ స్థానానికి పరిమితమైన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పరిషత్ పోరులో తన ఉనికిని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 58 జడ్పీటీసీ స్థానాలకు గాను ఇప్పటికే 2 ఏకగ్రీవమై టిఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో చేరాయి.

58 ఎంపీపీ స్థానాలను, 653 ఎంపీటీసీ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ వ్యూహం రచిస్తుండగా కాంగ్రెస్, బిజెపిలు సైతం తమ అభ్యర్థులను గెలిపించుకొని తమ పార్టీల బలోపేతానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో 4 జడ్పీ పీఠాలపైనే అన్ని పార్టీల నేతలు గురిపెట్టారు. ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నకొద్దీ అధికార పార్టీ మాత్రం ముందస్తు వ్యూహంతో క్లీన్‌స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది. మొదటి విడత ఘట్టం ఇంకోరోజుతో సమాప్తం కానుంది, రెండవ విడత ప్రచార హోరు కొనసాగుతుండగా, మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి ఉపసంహరణ మే 6 వరకు ఉండడంతో రెబెల్స్‌ను తప్పించేందుకు ముఖ్య నేతలు తంటాలు పడుతున్నారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముఖ్య నేతలకు పరిషత్ పరీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: