తొలి దశ ప్రచారానికి తెర…

  14 మండలాల్లో ప్రచారం పరి సమాప్తి చివరి రోజు హోరాహోరీగా ప్రచారం ప్రచారంలో అలసిపోయి సేదతీరుతున్న అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్న ఎంపి పొంగులేటి, నామా, సత్యవతి ప్రలోభాలపై దృష్టి సారించిన అభ్యర్థులు ఖమ్మం  :  తొలి దశ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 14 మండలాల్లోని జెడ్పీటిసి, ఎంపిటిసి స్థానాలకు గాను గత వారం రోజుల నుంచి అభ్యర్థులంతా మండుటెండలో సుడిగాలి ప్రచారం చేసిన అభ్యర్థులంతా సేద తీరారు. ఎక్కడి […] The post తొలి దశ ప్రచారానికి తెర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

14 మండలాల్లో ప్రచారం పరి సమాప్తి
చివరి రోజు హోరాహోరీగా ప్రచారం
ప్రచారంలో అలసిపోయి సేదతీరుతున్న అభ్యర్థులు
ప్రచారంలో పాల్గొన్న ఎంపి పొంగులేటి, నామా, సత్యవతి
ప్రలోభాలపై దృష్టి సారించిన అభ్యర్థులు

ఖమ్మం  :  తొలి దశ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 14 మండలాల్లోని జెడ్పీటిసి, ఎంపిటిసి స్థానాలకు గాను గత వారం రోజుల నుంచి అభ్యర్థులంతా మండుటెండలో సుడిగాలి ప్రచారం చేసిన అభ్యర్థులంతా సేద తీరారు. ఎక్కడి ప్రచార రథాలు అక్కడే ఆగిపోయాయి. మైకులన్నీ మూగబోయాయి. ఉమ్మడి జిల్లాలో 14 జెడ్పిటిసి, 183 ఎంపిటిసి స్థానాలకు గాను మొత్తం 716 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ముదిగొండ మండలంలో వల్లభిలోని రెండు, టేకుల పల్లిలోని కోయగూడెం ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వల్లభిలోని రెండు ఎంపిటిసి స్థానాల్లో ఒకటి టిఆర్‌ఎస్, మరొకటి కాంగ్రెస్ దక్కించుకుంది. టిఆర్‌ఎస్ అభ్యర్థి వడ్డేపుడి రజినీ, కాంగ్రెస్ అభ్యర్థి బిచ్చాల భిక్షం, కోయగూడెంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి జాల సంధ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మెజార్టీ స్థానాల్లో త్రిముఖ పోటీలు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల మధ్యే నువ్వా.. నేనా అనే చందంగా పోటీ నెలకొంది. పార్టీ పరంగా జరుగుతున్న జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల విజయం కోసం ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ప్రచారం చేయడం గమనార్హం. అధికార టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుతో పాటు జిల్లా ఇంచార్జ్ నూకల నరేశ్ రెడ్డి, జిల్లా సమన్వయకర్త ఆర్.శ్రావణ్‌కుమార్ రెడ్డి, సిట్టింగ్ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు ఇతర ముఖ్యనాయకులు ప్రచారం చేశారు. తొలివిడతగా ఖమ్మం జిల్లాలో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కామేపల్లి, కారేపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బుర్గంపహాడ్, ములకలపల్లి, పాల్వంచ, టేకుల పల్లి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు జెడ్పిటిసి స్థానాలకు మొత్తం 41 మంది అభ్యర్థులు, 110 ఎంపిటిసి స్థానాలకు 337 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఈ దశలో భద్రాద్రి కొత్తగూడెం జెడ్పి చైర్మన్ పదవి రేసులో ఉన్న అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. అధికార టిఆర్‌ఎస్ నుంచి ఇల్ల్లందుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకుల పల్లి జెడ్పిటిసిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్న భూక్యాదళ్ సింగ్, చందా సంతోష్ కూడా పోటీలో ఉన్నారు. చివరి రోజైన శనివారం జోరుగా ప్రచారం నిర్వహించారు. నిప్పులు కురిపించే విధంగా ఎండలు ఉన్నప్పటికీ ఇదే చివరి రోజు కావడంతో అభ్యర్థులు మండుటెండలో సైతం ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ సభ్యు లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముదిగొండ, కారేపల్లి, ఖమ్మం రూరల్‌లో ప్రచారంతొలి దశ ప్రచారానికి తెర చేశారు. కారేపల్లి మండలం పోలంపల్లి, భాగ్యనగర్ తండా గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు.

ముదిగొండ మండలం వనంవారి కృష్టాపురం, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో కూడా ఆయన ప్రచారం చేశారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూసుమంచి మండల కేంద్రంతో పాటు చేగొమ్మ, ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రేగా కాంతారావు బూర్గంపహాడ్‌లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కూడా బుర్గంపహాడ్, అశ్వాపురంలో ప్రచారం నిర్వహించారు. ఖమ్మం రూరల్‌లో సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ నాయకులు ఉమ్మడిగా ప్రచారం చేశారు. జెడ్పిటిసి అభ్యర్థి విజయం కోసం పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఈ ప్రచారంలో పొల్గొన్నారు.

శనివారం ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణగ్రత నమోదైంది. వడగాలి మధ్య ప్రచారాన్ని కొనసాగించారు. ఎండలో సైతం జనం భారీగా కదిలివచ్చారు. తొలి దశ ప్రచారం ముగియడంతో అభ్యర్థులంతా ప్రలోభాలపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జోరుగా డబ్బు పంపిణీ చేసిన నేపధ్యంలో గ్రామాల్లో ఈ ఎన్నికల్లో కూడా ఓటర్లు డబ్బును ఆశిస్తుండటంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీల నుంచి నిధులు రాకున్నప్పటికీ అభ్యర్థులే అప్పు చేసి ఎన్నికల్లో డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ అయిన స్థానాల్లో అభ్యర్థులకు నిధుల కొరత భారీగా ఏర్పడింది. పార్టీలు చేతులు ఎత్తేయడంతో అభ్యర్థులంతా లబోదిబోమంటున్నారు. ఓటుకు రూ.1000, రూ.2000 ఇవ్వకపోయినా కనీసం రూ.500 లేదా రూ.200 ఇవ్వాలని కొన్ని ప్రాంతాల్లో నిర్ణయించారు. మరికొన్ని చోట్ల కులాల వారీగా భోజనాలు, కోడి మాంసం పంపిణీ వంటి తాయిలాలు అందిస్తున్నారు.

The first phase of the campaign was completed

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తొలి దశ ప్రచారానికి తెర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: