నిరుపేదకు పెద్ద కష్టం…

  నందిపేట: తమది నిరుపేద కుటుంబం. గుంట భూమిలేదు. ఉద్యోగం చేయడానికి పెద్ద చదువూ లేదు. కూలీ పనికి వెలితే తప్ప పొట్ట గడిచే పరిస్థితీ లేదు. కానీ ఎంత చేసినా పొట్ట నింపుకోవడం తప్ప పైసా కూడా కూడబెట్టక పోవడంతో తాను గల్ప్ వెళ్ళేందుకు భార్య, తల్లిని ఒప్పించాడు. ఎన్నిరోజులు కష్టపడ్డా కష్టాలు తీరవని ఇద్దరినీ ఒప్పించి అప్పుచేసి ఉపాది కొరకు రెండేళ్ళ క్రితం గల్ప్‌బాట పట్టాడు. కొన్ని రోజుల పాటు బాగానే పనిచేసిన ఆయనకు […] The post నిరుపేదకు పెద్ద కష్టం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నందిపేట: తమది నిరుపేద కుటుంబం. గుంట భూమిలేదు. ఉద్యోగం చేయడానికి పెద్ద చదువూ లేదు. కూలీ పనికి వెలితే తప్ప పొట్ట గడిచే పరిస్థితీ లేదు. కానీ ఎంత చేసినా పొట్ట నింపుకోవడం తప్ప పైసా కూడా కూడబెట్టక పోవడంతో తాను గల్ప్ వెళ్ళేందుకు భార్య, తల్లిని ఒప్పించాడు. ఎన్నిరోజులు కష్టపడ్డా కష్టాలు తీరవని ఇద్దరినీ ఒప్పించి అప్పుచేసి ఉపాది కొరకు రెండేళ్ళ క్రితం గల్ప్‌బాట పట్టాడు. కొన్ని రోజుల పాటు బాగానే పనిచేసిన ఆయనకు ఆనారోగ్యం రూపంలో దరిద్రం వెంటాడింది. అక్కడి కంపెనీ వారు ఆరోగ్యం బాగా లేదంటూ స్వదేశానికి పంపడంతో దిక్కుతోచని స్థితిలో ఇంటికి చేరుకున్నాడు.

గల్ప్ వెళ్ళడానికి చేసిన అప్పులు అట్లాగే ఉండగా మళ్ళీ ఆసుపత్రుల్లో చూపించుకునేందుకు కొత్త అప్పులు చేసి ఆసుపత్రుల వెంబడి తిరిగాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పడంతో కుటుబం సభ్యులంతా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. హృదయ విదారకంగా ఉన్న ఈ సంఘటన నందిపేట మండల మారంపల్లి గ్రామానికి చెందిన 37 సంవత్సరాల వయసున్న సిందికారి కిషన్ అనే వ్యక్తిది.  సిందికారి మోహన్ బోజమ్మ దంపతులకు కిషన్‌తో పాటు ఇద్దరు అమ్మాయిలు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. కిషన్‌కు బార్య గౌతమి, పదేళ్ళ కూతురు ఐశ్వర్య ఉంది. తల్లితండ్రులకి వృద్దాప్యం రావడంతో కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కు.

కుటుంబ బారం ఎక్కువ కావడంతో రెండేళ్ళ క్రితం అప్పు చేసి గల్ప్ దేశానికి వెళ్ళాడు. ఏడాది పాటు బాగానే పనిచేసిన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో కంపెనీ వారు ఆయన్ను స్వదేశానికి పంపారు. ఇక్కడికి వచ్చాక ఆసుపత్రుల్లో పరీక్షలు చేయిస్తే రెండు కిడ్నీలు చెడిపోయినట్లుగా చెప్పారు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇక తమకు దిక్కెవరంటూ తల్లిదండ్రులతో పాటు బార్యా, కూతురు రోదిస్తున్నారు. తల్లిదండ్రులు దినసరి కూలీ పనికి వెలుతుండగా భార్య బీడీలు చుడుతుంది. పొట్ట గడవడమే కష్టంగా ఉన్నప్పటికీ ఆయన్ను బతికించుకునేందుకు గడిచిన ఏడాదిగా 6 సార్లు హైదరాబాద్‌లో, 2 సార్లు నిజామాబాద్‌లో డయాలసిస్ చేయించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి విషమంగా మారడంతో కిడ్నీలు మార్చాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. నెలరోజులుగా డయాలసిస్ చేయడం లేదు.

తల్లి ముందుకు వచ్చినా: ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో తప్పని సరిగా కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కిడ్నీ దాతలు సమయానికి దొరకడం చాలా కష్టం. ఎక్కడైనా ఆసుసత్రుల్లో ప్రమాదాల బారిన పడినవారి కిడ్నీలు దొరుకుతాయిని భావించినా తమ పరిస్థితి గురించి వివరిస్తూ ధరఖాస్తులు చేసుకున్న ఏడాది తర్వాత కూడా కిడ్నీలు దొరకని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తన కొడుకును బ్రతికించుకునేందుకు ఆయన తల్లి బోజమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ ఆమె కిడ్నీ సైజు, బ్లడ్‌గ్రూపు పరీక్షలు చేయించుకునేందుకు కూడా వారిదగ్గర డబ్బులు లేకపోవడంతో దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన కిషన్‌ను బ్రతికించుకునేందుకు దాతల ఆపన్న హస్తం కొరకు ఎదురు చూస్తున్నారు.
సహాయం చేయాల్సిన వారు ఈ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు.
THE NIZAMABAD DIST CO OPERATIVE CENTRAL BANK, NZB
ఖాతా నెంబరు-184322010000717
ifsc- TSAB0018043
PHONE. 9553938051 లో సంప్రదించాలని వారు కోరుతున్నారు.

 

Kidney patient waiting for financial assistance

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిరుపేదకు పెద్ద కష్టం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: