తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం..

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవిర్భవించిన తరువాత కుల వృత్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోత్సహిస్తూ ఆర్ధికంగా వారు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా భరోసా కల్పిస్తూ రుణంతో పాటు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి వాహన సౌకర్యం కల్పించి జీవనం కొనసాగించేందుకు మత్సకారులకు చేయూతనిస్తున్నారు. తక్కువ ఖర్చుతో మత్సకారులకు ఎక్కువ ఆదాయం అందించటమే లక్షంగా మత్సశాఖ పెన్ కల్చర్‌పై దృష్టి సారించింది. చేప పిల్లలను నీటి వనరులలో వదిలి వాటిని పెంచి పెద్ద చేసి […] The post తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవిర్భవించిన తరువాత కుల వృత్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రోత్సహిస్తూ ఆర్ధికంగా వారు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా భరోసా కల్పిస్తూ రుణంతో పాటు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి వాహన సౌకర్యం కల్పించి జీవనం కొనసాగించేందుకు మత్సకారులకు చేయూతనిస్తున్నారు. తక్కువ ఖర్చుతో మత్సకారులకు ఎక్కువ ఆదాయం అందించటమే లక్షంగా మత్సశాఖ పెన్ కల్చర్‌పై దృష్టి సారించింది. చేప పిల్లలను నీటి వనరులలో వదిలి వాటిని పెంచి పెద్ద చేసి ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తుంది. తొలిసారిగా ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆరు రిజర్వాయర్లలో అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఆయా జిల్లాల్లో పెద్ద పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో ఒక పరిమిత ప్రదేశంలో వెదురు బొంగులు, చెక్కలు, ఇనుప పరికరాలతో కంచెను నిర్మించి చేప పిల్లలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా వలలు కట్టి పెంచటాన్ని పెన్ కల్చర్ అంటారు. ఖమ్మం జిల్లాలోని పాలేరుతో పాటు మహబూబాబాద్‌లోని పెద్ద చెరువు, నల్లగొండలోని శాలిగౌరారం, కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపూర్, మెదక్‌లోని పోచారం రిజర్వాయర్‌లో పెన్ కల్చర్ ద్వారా చేప పిల్లలను పెంచేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

ఒక హెక్టార్ విస్తీర్ణంలో 5-7 లక్షల ఫింగర్ లింగ్ (25 ఎంఎం) చేప పిల్లలను వదలవచ్చు. మూడెళ్లుగా ఉచిత చేప పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఈ చేప పిల్లలను ఇతర ఉత్పత్తి కేంద్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పెన్ కల్చర్‌లో పెంచే ఫింగర్ లింగ్స్‌కు (25 ఎంఎం) చేప పిల్లలను కేవలం 25 పైసలకు కొనుగోలు చేసి పరిమిత ఎన్‌క్లోజర్‌లో దాణా అందించి 80 ఎంఎం సైజుకు వచ్చే వరకు పెంచుతారు. సమీకృత మత్స అభివృద్ధి పథకం కోసం జాతీయ సహకార అభివృద్ధి బ్యాంక్ (ఎన్‌సీడీబీ) నుంచి మత్సశాఖకు రూ. వెయ్యి కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో మత్సకారులకు ద్విచక్ర వాహనాలు, వలలు, ట్రాలి ఆటోల వంటివి సబ్సిడిపై పెద్ద ఎత్తున్న పంపిణీ చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తిని పెన్ కల్చర్‌లో పెంచేందుకు వీలు పడుతుంది. రాష్ట్రంలోని మత్సకారుల అభివృద్ధికి పెన్ కల్చర్‌లో ప్రవీణ్యం ఉన్న మత్స శాస్త్రవేత్త డాక్టర్ ఝా (ఉత్తరప్రదేశ్)ను హైదరాబాద్‌కు పిలిపించి అధికారులు చర్చలు జరిపారు.ఇటీవల మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఇతర రాష్ట్రాల్లో పెన్ కల్చర్ అమలును అధ్యాయనం చేసి వచ్చారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మత్స పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు పెన్ కల్చర్ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాలేరు రిజర్వాయర్‌లో ఈ విధానం కొనసాగుతుంది. భవిష్యత్తులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు విస్తరింపచేసి చేపల పెంపకాన్ని మరింత అభివృద్ధి చేసి మత్స కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తుంది.

telangana government Help To Fishermen

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: