ఎంపిటిసి, జెడ్పిటిసిల విధులు…బాధ్యతలు..!

అభివృద్ది పనుల్లో భాగస్వామ్యం.. సర్పంచ్ తర్వాతి స్థానం ఎంపిటిసి, జెడ్పిటిసిలదే గ్రామాలు, మండలాల అభివృద్దిలో కీలక పాత్ర   మనతెలంగాణ/హుజూరాబాద్ : సాధారణంగా గ్రామాలాభివృద్దిలో ప్రథమ పౌరుడిగా ఉన్న సర్పంచ్‌దే కీలక బాధ్యత. ఆ తర్వాతి స్థానం ఎంపిటిసి, జెడ్పిటిసిలదే.. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల సందర్భంగా మొదటి విడుదత నామినేషన్ల ఉపసంహరణ, రెండో విడుత నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మూడో విడుత నామినేషన్ల ప్రక్రియ సైతం మొదలైంది. అయితే ఆయా పదవులకు పోటీ చేస్తున్న పలువురికి […] The post ఎంపిటిసి, జెడ్పిటిసిల విధులు… బాధ్యతలు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అభివృద్ది పనుల్లో భాగస్వామ్యం..
సర్పంచ్ తర్వాతి స్థానం ఎంపిటిసి, జెడ్పిటిసిలదే
గ్రామాలు, మండలాల అభివృద్దిలో కీలక పాత్ర

 

మనతెలంగాణ/హుజూరాబాద్ : సాధారణంగా గ్రామాలాభివృద్దిలో ప్రథమ పౌరుడిగా ఉన్న సర్పంచ్‌దే కీలక బాధ్యత. ఆ తర్వాతి స్థానం ఎంపిటిసి, జెడ్పిటిసిలదే.. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల సందర్భంగా మొదటి విడుదత నామినేషన్ల ఉపసంహరణ, రెండో విడుత నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మూడో విడుత నామినేషన్ల ప్రక్రియ సైతం మొదలైంది. అయితే ఆయా పదవులకు పోటీ చేస్తున్న పలువురికి అధికారాలు, బాధ్యతలు ఏం ఉంటాయో తెలియదు. ఓటర్ల పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలో ఎంపిటిసి, జెడ్పిటిసి సభ్యుల బాధ్యతలపై, విధులపై “మనతెలంగాణ” ప్రత్యేక కథనం..

జిల్లా పరిషత్ సభ్యులు…

జిల్లా పరిషత్ వ్యవస్థ సక్రమంగా సాగేలా జెడ్పిటిసి సభ్యులు కృషి చేయాల్సి ఉంటుంది. జిల్లా అభివృద్దికి అవసరమైన బడ్జెట్ రూపకల్పన, ఆధాయ వ్యయాల రూపకల్పన, తక్షణ అవసరాలకు నిధుల కేటాయింపు తదితర అంశాల్లో వీరి భాగస్వామ్యం ఉంటుంది. మొత్తం జెడ్పిటిసిల్లో మూడో వంతు సభ్యుల అమోదంతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్మన్/చైర్ పర్సన్‌ను కొరవచ్చు. అలా మూడు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే సభ్యులే ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక జెడ్పిటిసి నియోజకవర్గ ఇంచార్జీ సలహా కమిటీ సభ్యుడిగా ఉండవచ్చు. మండల నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీ సభ్యుడిగా నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. జిల్లా పరిషత్ పాఠశాల స్థితిగతుల మెరుగు కోసం అధికారులకు సలహాలు ఇవ్వవచ్చు. జెడ్పీసీ ఇఒ సంతకంతో కూడిన ఫోటో గుర్తింపు కార్లు ఉంటే జెడిపిటిసి, ఎంపిపీలను రాష్ట్ర అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు కూడా అనుమతిస్తారు. అన్ని ప్రభుత్వ జెడ్పీ అధికార ఉత్సవాలు, కార్యక్రమాలకు సభ్యులను తప్పక ఆహ్వానించాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ సభ్యులు తమ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అక్కడ పరిష్కారం కానీ సమస్యలను జెడ్పీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ప్రజలను సమన్వయ పరిచి పాలనా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. జెడ్పీ పనుల నిర్వహణలో లోపాలు, ఆలసత్వం, నిధుల దుబారా తదితర అంశాలను జెడ్పీ చైర్మన్, సీఈవో దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయవచ్చు. 15 రోజుల వ్యవధి ముందు నోటీసుతో పరిపాలనకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. మూడు నెలలకు జెడ్పీ సీఈవో తయారు చేసే ఆర్థిక నివేదికను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు చేయాలి. జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్థాయి సంఘం సమావేశాలు జరిగే రోజున మహిళా సభ్యులకు జెడ్పీ వసతి గృహాల్లో వసతి కలిపంచాలి. ఇతర రోజుల్లో కూడా ఎంపి, ఎమ్మెల్యేల తర్వాతి స్థానం వీరికే ఉంటుంది.

మండల పరిషత్ సభ్యులు…

1994లో ఏర్పడిన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎంపిటిసి సభ్యులకు మండల పరిషత్‌లో ఓటు హక్కు కల్పించారు. గతంలో సర్పంచ్‌లు సమితిలో ఉండేవారు. మండల పరిషత్ వ్యవస్థ అమల్లోకి రావడంతో ఎంపిటిసి పదవులు వచ్చాయి. మండల, గ్రామాలాభివృద్దిలో వీరు కీలకంగా మారారు. ఎంపిటిసి సభ్యుడు తాను ఎన్నికైన ప్రాదేశిక నియోజకవర్గంలోని పంచాయతీల్లో సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. వీరు గ్రామసభలు, ప్రభుత్వ ఆదేశాలకు హాజరయ్యే అధికారం ఉంటుంది. సమస్యలు, అవసరాలను గుర్తించి అభివృద్ది నిధులు రాబట్టేందుకు ప్రతిపాదనలు చేయవచ్చు. మండల వ్యాప్తంగా ఎన్నికైన ఎంపిటిసి సభ్యుల్లో ఒకరూ అద్యక్ష పదవీ, మరొకరూ ఉపాద్యక్ష పదవి పొందవచ్చు. జెడ్పి సమావేశాల మాదిరిగానే ఇక్కడ సర్వ సభ్య సమావేశాలు, స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపిటిసి సభ్యులు పాల్గొని సమస్యలను ప్రస్తావించవచ్చు. ఎన్నికైన ఎంపిటిసి సభ్యులు తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి. మొదటి మూడు సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయకుంటే వారి సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. అభివృద్ది పనుల్లో అవకతవకలు జరుగుతుంటే ఆ విషయాన్ని ప్రశ్నించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత సభ్యులదే. మండల పరిషత్‌లో జరిగే సమావేశాలకు హాజరై అభివృద్దికి సూచనలు చేయవచ్చు. అలాగే నిధులతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఎంపిటిసి సభ్యులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి.

 

MPTC and ZPTC Duties and Responsibilities in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎంపిటిసి, జెడ్పిటిసిల విధులు… బాధ్యతలు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: