హెల్త్ కార్నర్: ఆహారమే.. ఆరోగ్యం

పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. రోజూ ఏదో ఒక సమయంలో గ్లాసు రసం తాగితే.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. అలాగే మూత్రాశయంలో చిన్న చిన్న రాళ్లుంటే, వాటిని కరిగించేస్తుంది. పావు టీ స్పూన్ జీలకర్ర పొడిలో చిటికెడు ఇంగువ, కాస్త ఉప్పు గోరు వెచ్చని నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపునొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసుకొని, అందులో టీ […] The post హెల్త్ కార్నర్: ఆహారమే.. ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. రోజూ ఏదో ఒక సమయంలో గ్లాసు రసం తాగితే.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. అలాగే మూత్రాశయంలో చిన్న చిన్న రాళ్లుంటే, వాటిని కరిగించేస్తుంది.

పావు టీ స్పూన్ జీలకర్ర పొడిలో చిటికెడు ఇంగువ, కాస్త ఉప్పు గోరు వెచ్చని నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల
కడుపునొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసుకొని, అందులో టీ స్పూన్ తేనెను కలపాలి. దాన్ని రోజుకు మూడు సార్లు తీసుకుంటే మౌత్ అల్సర్స్ తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని అల్సర్స్‌పై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

పండిన చింతకాయను నీటిలో కలిపి ముద్దగా చేయాలి. దాంట్లో పంచదార కలిపి తాగితే వడదెబ్బ నుండి విముక్తి లభిస్తుంది. శరీరం హాయిగా ఉంటుంది.

చిన్న పిల్లలకు డైపర్స్ వాడటం వల్ల, తరచూ ర్యాషస్ అవుతుంటాయి. అవి పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటప్పుడు ఆ ర్యాషస్ ఉన్నచోట రోజుకు 5,6 సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే పిల్లలకు కాస్త ఉపశమనం కలుగుతుంది.

జ్వరంతో బాగా నీరసంగా ఉన్నప్పుడు.. రాత్రి పడుకునే ముందు 4,5 ఖర్జూరాలను నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని గ్రైండ్ చేసుకొని తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఈ టానిక్ పిల్లలకు త్వరగా ఫలితాన్ని చూపుతుంది.

టీ స్పూన్ మెంతులను రెండు గ్లాసుల నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీటిని వడగట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడే రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. అలా చేస్తే మోకాళ్ల నొప్పులతో పాటు మధుమేహం సమస్య కూడా తగ్గుతుంది.

పచ్చి మామిడికాయ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ముక్కలను ఉప్పులో ముంచుకొని తింటే వేసవిలో అనారోగ్యాలు, అతి దాహం, అలసట, మానసిక చికాకులు తగ్గుతాయి. ఇంకెందుకు ఆలస్యం తినేయండి.

benefits of healthy food in Telugu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెల్త్ కార్నర్: ఆహారమే.. ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: