చిమ్మచీకట్లో ప్రభుత్వాసుపత్రి..భయం గుప్పిట్లో రోగులు

నవీపేట ః ప్రభుత్వా ఆసుపత్రులపైన ప్రత్యేక శ్రద్దతో మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోగుల కోసం ప్రత్యేకంగా అన్ని హంగులతో తీర్చిదిద్దామని చెప్పిన, కింది స్థాయి సిబ్బంది మాత్రం అందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో నవీపేట, రెంజల్, మాక్లూర్ మండలాలతో పాటు మండలం నుండి ఇక్కడికి వచ్చి ప్రసూతిలు చేయించుకుంటారు. ప్రతి శుక్రవారం, మంగళవారాల్లో ఆపరేషన్‌లు, నార్మల్ డెలివరిలు చేస్తుంటారు. రోగులతో వచ్చిన బంధువులతో కలిపి నెలలో వందల సంఖ్యలో ఆసుపత్రికి వస్తుంటారు. రోగుల […] The post చిమ్మచీకట్లో ప్రభుత్వాసుపత్రి..భయం గుప్పిట్లో రోగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నవీపేట ః ప్రభుత్వా ఆసుపత్రులపైన ప్రత్యేక శ్రద్దతో మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోగుల కోసం ప్రత్యేకంగా అన్ని హంగులతో తీర్చిదిద్దామని చెప్పిన, కింది స్థాయి సిబ్బంది మాత్రం అందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో నవీపేట, రెంజల్, మాక్లూర్ మండలాలతో పాటు మండలం నుండి ఇక్కడికి వచ్చి ప్రసూతిలు చేయించుకుంటారు. ప్రతి శుక్రవారం, మంగళవారాల్లో ఆపరేషన్‌లు, నార్మల్ డెలివరిలు చేస్తుంటారు. రోగులతో వచ్చిన బంధువులతో కలిపి నెలలో వందల సంఖ్యలో ఆసుపత్రికి వస్తుంటారు. రోగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు లేవు, కనీసం రాత్రిపూట చిమ్మచీకట్లో భయంతో గడపాల్సి వస్తుంది. ఆరుబయట ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేసుకోవడం, ఆసుపత్రి ఆవరణ మొత్తం లైట్లు లేకపోవడంతో చీకట్లో ఉండడం వల్ల రోగులు వారి బంధువులు భయంతో జంకుతున్నారు. పగిలిన ట్యూబ్‌లైట్లు దర్శనం ఇస్తున్న నెలల తరబడి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని రోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

No facilities for patients In NaviPet Govt hospital

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిమ్మచీకట్లో ప్రభుత్వాసుపత్రి..భయం గుప్పిట్లో రోగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: