టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : నామా

ఖమ్మం రూరల్ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉందని, టిఆర్ఎస్ కు చెందిన జడ్ పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని ఖమ్మం టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి నామనాగేశ్వరరావు అన్నారు. గురువారం జడ్ పిటిసి, ఎంపీటిసిల విజయాన్ని కాంక్షిస్తు మండలంలోని కొండాపురం, సీతరాంపురం, ఆరెంపుల, బారుగూడెం గ్రామాలల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జడ్ పిటిసి అభ్యర్థి యండపల్లి వరప్రసాద్, కొండాపురం ఎంపిటిసి అభ్యర్థి  బెల్లం ఉమతో కలిసి సీతరాంపురంలోని ఉపాధి కూలీలతో […] The post టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : నామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం రూరల్ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉందని, టిఆర్ఎస్ కు చెందిన జడ్ పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని ఖమ్మం టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి నామనాగేశ్వరరావు అన్నారు. గురువారం జడ్ పిటిసి, ఎంపీటిసిల విజయాన్ని కాంక్షిస్తు మండలంలోని కొండాపురం, సీతరాంపురం, ఆరెంపుల, బారుగూడెం గ్రామాలల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జడ్ పిటిసి అభ్యర్థి యండపల్లి వరప్రసాద్, కొండాపురం ఎంపిటిసి అభ్యర్థి  బెల్లం ఉమతో కలిసి సీతరాంపురంలోని ఉపాధి కూలీలతో కలిసి చెరువు మట్టిని తోడారు. ఈ సందర్భంగా నామా మాట్లాడారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. రైతు బందు పథకం చారిత్రత్మకమని చెప్పారు. ఈ పథకం పేరు మార్చి  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉందని , పాలేరునియోజకవర్గ ఎమ్మెల్యే మన వ్యక్తేనని, అభివృద్ధి విషయంలో ఆలోచించాల్సిన పని లేదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ పాలన చేస్తున్నారని నామా కొనియాడారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు తెచ్చి అభివృద్ది పనులు చేసే బాధ్యత తనదని, టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ప్రజలదే అన్నారు. అన్ని రకాలుగా తెలంగాణ పటిష్ఠంగా ఉందని, టిఆర్ఎస్ కు చెందిన  జడ్ పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు బేబి మద్దినేని స్వర్ణకుమారి, మాజీ పాలేరు నియోజకవర్గ ఆత్మ చైర్మన్ మద్ది మాల్లారెడ్డి, కార్పొరేటర్ రామ్మూర్తినాయక్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఆరెంపుల సర్పంచ్ బండి జగదీష్, బారుగూడెం సర్పంచ్ పలెర్ల పాండ్రయ్య, ఆరెంపుల ఉపసర్పంచ్ బండి సతీస్, టిఆర్‌ఎస్ నాయకులు వెంపటి రవి, యూత్ అధ్యక్షులు గూడ సంజీవరెడ్డి, దండ్యాల రమేష్, అక్కినపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Nama Comments on ZPTC and MPTC Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : నామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: