చుండ్రు వేధిస్తోందా?

ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే చాలు కాలుష్యంతో వెంట్రుకలు పాడవుతున్నాయి. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు ఎండ వల్ల జుట్టు పెళుసుగా తయారవ్వడమేగాక, చుండ్రు బాధ తప్పడం లేదు. ఎలాంటి జుట్టుకైనా సరైన పోషణతో, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు హెయిర్‌డామేజ్‌ను అరికట్టవచ్చు. జుట్టు బాగుండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. తరచూ వేధించే చుండ్రు వదలగొట్టుకోవాలంటే రెండు స్పూన్ల బ్రౌన్ షుగర్‌కు ఒక హెయిర్ కండిషనర్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. కాసేపటి తర్వాత నీళ్లతో […] The post చుండ్రు వేధిస్తోందా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే చాలు కాలుష్యంతో వెంట్రుకలు పాడవుతున్నాయి. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు ఎండ వల్ల జుట్టు పెళుసుగా తయారవ్వడమేగాక, చుండ్రు బాధ తప్పడం లేదు. ఎలాంటి జుట్టుకైనా సరైన పోషణతో, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు హెయిర్‌డామేజ్‌ను అరికట్టవచ్చు. జుట్టు బాగుండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
తరచూ వేధించే చుండ్రు వదలగొట్టుకోవాలంటే రెండు స్పూన్ల బ్రౌన్ షుగర్‌కు ఒక హెయిర్ కండిషనర్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. కాసేపటి తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే చుండ్రు సమస్య పోతుంది. నెలకు ఒకసారి ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

సూర్యకిరణాల వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయనే విషయం తెలిసిందే. జుట్టుకు తేనె, ఆలివ్ ఆయిల్ మిశ్రమం రాస్తే మంచిది. అరకప్పు తేనెలో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ కలిపి వెంట్రుకలకు బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆలివ్ ఆయిల్ వెంట్రుకలకు కండిషనర్‌గా పనిచేస్తే, తేనెలో కండిషనర్ గుణాలతోపాటు యాంటీ బాక్టీరియల్ గుణాలున్నాయి. రేగినట్టు ఉండే చిక్కటి వెంట్రుకలకు అవకాడొ గుజ్జును పట్టిస్తే మంచిది. దాంతో జుట్టు సాఫ్ట్‌గా, సిల్కీగా తయారవుతుంది.

Dandruff Control Tips in Telugu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చుండ్రు వేధిస్తోందా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.