సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవాని

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. దుర్గతులను నాశనం చేసేది దుర్గ. దుర్గని నమ్మి కొలిస్తే దుర్గతులండవనేది భక్తుల నమ్మకం. ఆ చల్లని తల్లి అనేక ప్రాంతాలలో కొలువై నమ్మిన భక్తులను కాపాడుతోంది. ఆ తల్లి కొలువైవున్న క్షేత్రాల్లో ఒకటి మన రాజధానికి సమీపంలో వున్న మెదక్ జిల్లా, ఈశ్వరపురం లేదా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని సప్త ప్రా కార యుత దుర్గా భవాని క్షేత్రం. పటాన్ చెరువు దాటిన తర్వాత 10 కి.మీ. ల దూరంలో […] The post సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. దుర్గతులను నాశనం చేసేది దుర్గ. దుర్గని నమ్మి కొలిస్తే దుర్గతులండవనేది భక్తుల నమ్మకం. ఆ చల్లని తల్లి అనేక ప్రాంతాలలో కొలువై నమ్మిన భక్తులను కాపాడుతోంది. ఆ తల్లి కొలువైవున్న క్షేత్రాల్లో ఒకటి మన రాజధానికి సమీపంలో వున్న మెదక్ జిల్లా, ఈశ్వరపురం లేదా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని సప్త ప్రా కార యుత దుర్గా భవాని క్షేత్రం. పటాన్ చెరువు దాటిన తర్వాత 10 కి.మీ. ల దూరంలో గణేష్ గడ్డలోని విఘ్నేశ్వరుడి ఆలయం రోడ్డు మీదకే కనబడుతుంది.

ఆ స్వామిని దర్శించి, ఆ ఆలయానికి పక్క నే వున్న సందులోంచి లోపలకి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే దుర్గా భవానీ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ముందు మనకి ఒక పురాతన కోట ముఖ ద్వారం కనబడుతుంది. దీనిలోంచి లోపలకెళ్ళాలి. విశాలమైన ఈ కోట గోడ మధ్య ఆలయం వుంది. అమ్మవారు ఇక్కడ వెలిసిన విషయం గురించి చాలా కాలం క్రితం మేము వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పారు. ఈ కోట గోడ నిర్మించేటప్పుడు భవాని అనే ఒక అమ్మాయి అక్కడ కూలీగా పని చేస్తున్న త న అన్నగారికోసం భోజనం తీసుకు వచ్చేదిట. ఒకసారి కొందరు తుంటరి కూలీలు ఆ అమ్మాయిని ఏ డిపించారట. దానితో ఆమె కలత చెంది ఆ ప్రాకారంలో ఓ మూలకు వెళ్ళి శిలగా మారి పోయింద ట. ఇదంతా జరిగి 800 సంవత్సరాలు దాటిపోయింది. ఇది నిజమవునో కాదో తెలియదుగానీ, ఈ అమ్మవారు స్వయంభు అంటారు. స్వయంభూ విగ్రహం కోట గోడలోనే ఒక మూలగా వున్న చిన్న ఆలయంలో వున్నది.

అక్కడ నిత్య పూజలు, శుక్రవారం విశేష పూజలు జరుగుతూంటాయి. ఇంకొక ఉపాలయంలో లక్ష్మీ గణపతి కొలువు తీరాడు. ఇక్కడే వున్న శివాలయం దగ్గర భక్తులు తమ కోరిక లు అమ్మవారికి విన్నవించుకుని ముడుపులు కడతారు. ప్రధాన ఆలయంలో శ్రీ దుర్గా భవాని విగ్ర హం 12 అడుగుల ఎత్తున వున్న నల్లరాతి విగ్ర హం. సింహ వాహనం మీద కూర్చున్నట్లున్న అమ్మ ఇంత పెద్ద విగ్రహాన్ని ఒకే రాతిలో చెక్కారు. అష్ట భుజి అయిన అమ్మవారు చేతులలో వివిధ ఆయుధాలనూ ధరించి భక్తులకు అభయమిస్తున్నట్లు వుం టుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటూనే భక్తి భావంతో అప్రయత్నంగా చేతులు జోడిస్తాం.

అమ్మవారి ముందు మండపంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. భక్తులు దీనికి కుంకుమ పూజ చేసుకుంటారు. ఇవే కాక మంగళ వారం రాహు కాల పూజలకి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ ఆలయ పునరుద్ధరణ జరిగి 2001 లో ఫాల్గుణ మాసంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ పురాతన క్షేత్రాన్ని పునరభివృద్ధి చేసింది కర్ణాటక రాష్ట్రంలోని బసవ కళ్యాణ పీఠం అధిపతి శ్రీ స్వామి మదనానంద సరస్వతి. ఈ ఆలయం శ్రీ శృంగేరీ జగద్గురు మహా సంస్ధాన్, దక్షిణామ్నాయ శారదా పీఠంవారి అధీనంలో వున్నది. శ్రీ భారతీ తీర్ధ స్వామివారు విచ్చేసి ఆదేశించిన ప్రకారం పూజా విధులు జరుగుతుంటాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి ప్రతిష్ట జరిగిన ఫాల్గుణ మాసం చతుర్ధి నుంచి షష్టి వరకు వార్షికోత్సవములు ఘనంగా జరుపబడుతున్నాయి. ఇవి కాక ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు, నవ చండీ యాగం, లక్ష దీపోత్సవాలు కూడా పెద్ద ఎత్తున జరుపుతారు.

భాద్రపద అమావాస్యనాడు అమ్మవారిని 50 కిలోల పసుపు ముద్దతో అలంకరిస్తారు. హైదరాబాదు సిటీకి 52 కి.మీ. దూరంలో వున్న ఈ ఆలయానికి ఆదివారం, సెలవు రోజుల్లో సిటీనుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళి వస్తూ వుంటారు. ఒక రోజు ఉదయమే బయల్దేరితే దైవ దర్శనం చేసుకుని, కొంచెం సేపు సరదాగా గడిపి రావచ్చు. ఆహార పానీయాలు తీసుకు వెళ్తే మంచిది.
Durga Devi Sapta Prakarayuta Bhavani Mata Temple                                                                             

పి.యస్.యమ్.లక్ష్మి

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.