నిజామాబాద్ రైతులకు.. వారణాసిలో అడ్డంకులు

మోడీపై పోటీకి అడ్డంకులు సోమవారం నామినేషన్ల దాఖలుకు నిర్ణయం రైతుల చుట్టూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మన తెలంగాణ/నిజామాబాద్‌ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ నిర్లక్షం పై తిరుగుబాటు చేసిన నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై పోటీకి సిద్ధమయ్యారు. అనేక అవాంతరాలను ఎదుర్కొని వారణాసికి చేరుకున్న రైతులకు అక్కడ కూడా తిప్పలు తప్పలేదు. నరేంద్ర మోడీ పై పోటీ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఎండగట్టాలని, భవిష్యత్తులో తమ డిమాండ్లకు భరోసా దక్కాలన్న […] The post నిజామాబాద్ రైతులకు.. వారణాసిలో అడ్డంకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మోడీపై పోటీకి అడ్డంకులు
సోమవారం నామినేషన్ల దాఖలుకు నిర్ణయం
రైతుల చుట్టూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు

మన తెలంగాణ/నిజామాబాద్‌ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ నిర్లక్షం పై తిరుగుబాటు చేసిన నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై పోటీకి సిద్ధమయ్యారు. అనేక అవాంతరాలను ఎదుర్కొని వారణాసికి చేరుకున్న రైతులకు అక్కడ కూడా తిప్పలు తప్పలేదు. నరేంద్ర మోడీ పై పోటీ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఎండగట్టాలని, భవిష్యత్తులో తమ డిమాండ్లకు భరోసా దక్కాలన్న లక్షంతో నిజామాబాద్ నుండి బయలుదేరిన రైతులకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమస్యలు సృష్టించినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్ళడంతోనే రైతుల చుట్టు మఫ్తీలో ఉన్న బలగాలు మోహరించినట్లు రైతులు వెల్లడించారు. అయితే పోటీకి కావాల్సిన నామినేషన్ పత్రాలను తీసుకున్న రైతులకు స్థానికంగా బలపర్చే అభ్యర్థులు దొరకకుండా స్థానిక బిజెపి నేతలు పావులు కదిపినట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పై పోరాటం చేస్తున్న రైతులు సైతం తెలంగాణ రైతులకు తోడుకావడంతో ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు శనివారం 20 నామినేషన్‌లను సిద్ధం చేసుకొని ఎన్నికల అధికారికి సమర్పించేందుకు ప్రయత్నించగా పలు కారణాలతో నామినేషన్‌లు స్వీకరించలేదని, మిగతా వాటితో కలిపి సోమవారం దాదాపు 50 నామినేషన్‌లు దాఖలు చేస్తామని రైతు ప్రతినిధి తిరుపతి రెడ్డి తెలిపారు. తమకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా ఎదుర్కొంటామని లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనుకడుగు వేయమని స్పష్టం చేస్తున్నారు.

అనేక మీడియా సంస్థలు పసుపు రైతులను ఇంటర్వూలు చేస్తుండగా నామినేషన్‌లు దాఖలై పోటీలో నిలిస్తే అసలైన చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడుకు చెందిన 40 మంది రైతులను పోలీసులు 24 గంటల పాటు నిర్బంధించి వదిలేశారు. అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తాము వేరు వేరు గ్రూపులుగా నామినేషన్‌ల దాఖలుకు రంగం సిద్ధం చేసుకున్నామని తెలిపారు.

Trouble For Nizamabad Farmers In Varanasi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్ రైతులకు.. వారణాసిలో అడ్డంకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: