చట్టప్రకారమే ఐటి దాడులు : ప్రధాని మోడీ

భోపాల్ : చట్ట ప్రకారమే పలువురు నేతల ఇళ్లపై ఐటి అధికారులు దాడులు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో ఈ దాడులు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేసినట్టు భావిస్తే, తన ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడులు చేయవచ్చని ఆయన తేల్చి చెప్పారు. ఐటి దాడులను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం ఉదయం ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యప్రదేశ్ లోని సిద్ధిలో […] The post చట్టప్రకారమే ఐటి దాడులు : ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భోపాల్ : చట్ట ప్రకారమే పలువురు నేతల ఇళ్లపై ఐటి అధికారులు దాడులు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో ఈ దాడులు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేసినట్టు భావిస్తే, తన ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడులు చేయవచ్చని ఆయన తేల్చి చెప్పారు. ఐటి దాడులను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం ఉదయం ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యప్రదేశ్ లోని సిద్ధిలో జరిగిన బిజెపి ఎన్నికల బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బిల్లులు తగ్గించకపోగా, విద్యుత్ సరఫరాను తగ్గించిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే విద్యుత్ సరఫరాను తగ్గించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కేంద్రప్రభుత్వ అనుకూల వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కూటములు కట్టినా అధికారం తమదేనని ఆయన తేల్చిచెప్పారు.

IT Attacks are Legal : PM Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చట్టప్రకారమే ఐటి దాడులు : ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: