తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

  హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఏప్రిల్ 16, 2019వ తేదీన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,03,591 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాజరు కాగా.. అందులో 92.53 శాతం మంది అంటే 95,850 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా […] The post తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఏప్రిల్ 16, 2019వ తేదీన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,03,591 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాజరు కాగా.. అందులో 92.53 శాతం మంది అంటే 95,850 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉండగా ఈ ఫలితాలను హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న ఎస్‌బిటిఇటి ఆఫీసులో విడుదల చేశారు.

పాలిసెట్ 2019లో సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 సాధించి మొదటి స్థానం పొందారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 120 మార్కులకు 119 మార్కులు సాధించి ఏడో, పదో స్థానంలో నిలిచారు. అభ్యర్థులు పాలిసెల్ ఫలితాలను www.ntnews.com వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Telangana Polycet results released

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: