ప్రేమకు బ్రేకప్‌ చెప్పిన శృతి

చెన్నయ్: ప్రముఖ సినీ నటి శ్రుతి హాసన్‌ తన ప్రేమకు బ్రేకప్ చెప్పేశారు. శృతి కొంతకాలంగా లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు విడిపోయారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. తాము విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని మైఖెల్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన  శ్రుతితో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు.  శృతి మైఖెల్ మధ్య ఎలాంటి గొడవలు జగరలేదని, పరస్పరం చర్చించుకుని స్నేహపూర్వకంగానే విడిపోయారని […] The post ప్రేమకు బ్రేకప్‌ చెప్పిన శృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్: ప్రముఖ సినీ నటి శ్రుతి హాసన్‌ తన ప్రేమకు బ్రేకప్ చెప్పేశారు. శృతి కొంతకాలంగా లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు విడిపోయారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. తాము విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని మైఖెల్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన  శ్రుతితో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు.  శృతి మైఖెల్ మధ్య ఎలాంటి గొడవలు జగరలేదని, పరస్పరం చర్చించుకుని స్నేహపూర్వకంగానే విడిపోయారని శృతి సన్నిహితులు తెలిపారు.  2016లో శ్రుతి  లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ఓ స్నేహితురాలి ద్వారా మైఖెల్‌ పరిచయమయ్యారు. అనంతరం ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారిన విషయం తెలిసిందే. శ్రుతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మైఖెల్‌ కూడా హాజరయ్యేవాడు. మైఖెల్ శ్రుతి తల్లిదండ్రులను కూడా కలిశారు. శృతి తండ్రి, విశ్వనటుడు కమల్ హాసన్‌ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమాలో మైఖెల్‌ రష్యన్‌ సోల్జర్‌ పాత్రలో నటించిన విషయం విదితమే. శృతి, మైఖెల్ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

Actress Shruti Haasan Breaks Up Her Love

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమకు బ్రేకప్‌ చెప్పిన శృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: